Chiranjeevi – Mohan Babu : మెగాస్టార్‌తో మోహన్ బాబు వీకెండ్ ట్రిప్.. మంచు లక్ష్మీ కామెంట్స్..

మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో కలిసి వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేశారు. పలు సినిమాల్లో కలిసి నటించిన చిరు, మోహన్ బాబు మంచి స్నేహితులు అనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు.

Chiranjeevi – Mohan Babu : మెగాస్టార్‌తో మోహన్ బాబు వీకెండ్ ట్రిప్.. మంచు లక్ష్మీ కామెంట్స్..

Chiranjeevi And Mohan Babu Take A Weekend Trip To Sikkim

Updated On : March 15, 2021 / 12:40 PM IST

Chiranjeevi – Mohan Babu: మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో కలిసి వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేశారు. పలు సినిమాల్లో కలిసి నటించిన చిరు, మోహన్ బాబు మంచి స్నేహితులు అనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు.

ఎప్పుడూ షూటింగ్ హడావిడి, పని ఒత్తిడిలో ఉండే మనం కాసేపలా సరదాగా ఓ ట్రిప్ వేద్దాం అంటూ చిరు, మోహన్ బాబుని సిక్కిం టూర్‌కి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

డాడీ రానంటే చిరంజీవి అంకుల్ ఒప్పించి మరీ సిక్కిం తీసుకెళ్లారంటూ లక్ష్మీ, చిరు, మోహన్ బాబు బయలుదేరేముందు తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. మెగాస్టార్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఆచార్య’ తర్వాత ‘లూసీఫర్’ రీమేక్‌లో నటించనున్నారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో ‘సన్నాఫ్ ఇండియా’ సినిమా చేస్తున్నారు.