Chiranjeevi – Nagarjuna : ‘విక్రమ్ వేద’ రీమేక్‌లో చిరు – నాగ్..!

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ‘విక్రమ్ వేద’ తెలుగు రీమేక్‌లో కలిసి నటించబోతున్నారట.. చిరు, నాగ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి అన్నీ అనుకున్నట్టు కుదిరితే కలిసి నటించొచ్చు అనే టాక్ కూడా వినిపిస్తోంది..

Chiranjeevi – Nagarjuna : ‘విక్రమ్ వేద’ రీమేక్‌లో చిరు – నాగ్..!

Chiranjeevi And Nagarjuna In Vikram Vedha Telugu Remake

Updated On : April 29, 2021 / 11:25 AM IST

Chiranjeevi – Nagarjuna: విలక్షణ నటుడు ఆర్.మాధవన్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించగా తమిళ్‌లో సూపర్ డూపర్ హిట్ అయిన ‘విక్రమ్ వేదా’.. పుష్కర్- గాయత్రి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మాధవన్ పోలీస్ ఆఫీసర్‌ విక్రమ్, విజయ్ సేతుపతి గ్యాంగ్‌స్టర్‌ వేద పాత్రల్లో నటించారు..

Vikram Vedha

బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిందీ చిత్రం.. కొద్ది కాలంగా ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజా రవితేజ.. విక్టరీ వెంకటేష్, నారా రోహిత్ పేర్లు వినిపించాయి కానీ అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యలేదు..

Chiranjeevi - Nagarjuna

 

అయితే రీసెంట్‌గా ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు దర్శనమిస్తున్నాయి.. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ‘విక్రమ్ వేద’ తెలుగు రీమేక్‌లో కలిసి నటించబోతున్నారట.. చిరు, నాగ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి అన్నీ అనుకున్నట్టు కుదిరితే కలిసి నటించొచ్చు అనే టాక్ కూడా వినిపిస్తోంది..

Chiranjeevi - Nagarjuna