జూలై-ఆగస్టు మాసాల్లోనే హైదరాబాద్ నుంచే కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం, ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం కేసీఆర్
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ 3వ దశ మే 17వ తేదీతో ముగుస్తుంది. మరోసారి లాక్ డౌన్

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ 3వ దశ మే 17వ తేదీతో ముగుస్తుంది. మరోసారి లాక్ డౌన్
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ 3వ దశ మే 17వ తేదీతో ముగుస్తుంది. మరోసారి లాక్ డౌన్ పొడిగించాలా? లేక సడలింపులు ఇవ్వాలా? కరోనాను కట్టడి చేయాలంటే ఏం చేయాలి? ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వలస కార్మికుల తరలింపు.. వంటి అంశాలపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం(మే 11,2020) 5వ సారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్పై కార్యాచరణను ఈ కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కరోనా కట్టడికి, ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వడానికి, ప్రజల ఉపాధికి సంబంధించి సీఎం కేసీఆర్ పలు కీలక సూచనలు చేశారు. అలాగే కేంద్రం సాయం కూడా కోరారు. రాష్ట్రంలోని పరిస్థితులను ప్రధానికి వివరించారు.
కరోనాపై భయాందోళన తొలగించడం ద్వారానే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని సీఎం కేసీఆర్ ప్రధానితో చెప్పారు. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావాన్ని చూపిందని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదుకోవాలన్నారు.
ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం కేసీఆర్:
* జూలై-ఆగస్టు మాసాల్లోనే కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం
* హైదరాబాద్ నుంచే వ్యాక్సిన్ వచ్చే అవకాశం
* కరోనా వ్యాప్తి దృష్ట్యా దేశంలో రైళ్లను ఇప్పుడే పునరుద్దరించవద్దు
* రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది
* రాష్ట్రాల అప్పులను రీషెడ్యూల్ చేయాలి
* ఎఫ్ఆర్ బీఎం పరిమితిని పెంచాలి
* ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రానికి అనుమతించాలి
* త్వరలోనే వలస వెళ్లిన కూలీలు కూడా వెనక్కి వచ్చే అవకాశం
* కరోనా ఇప్పుడప్పుడే మనల్ని వదిలేలా లేదు
* కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాల్సిందే
* కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది
* పాజిటివ్ కేసులు లేని జిల్లాలను ఆరెంజ్/గ్రీన్ జోన్లుగా మార్చడంలో జాప్యం
* ఆ అంశంలో జాప్యం లేకుండా కేంద్రం చూడాలని కోరుతున్నాం