KCR: హెలికాప్టర్ అందుబాటులో ఉంచండి: వ‌ర‌ద‌ల‌పై స‌మీక్ష‌లో సీఎం కేసీఆర్

తెలంగాణ‌లో వ‌ర‌ద‌ల‌పై అధికారుల‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. భ‌ద్రాచ‌లం వ‌ద్ద మూడో ప్ర‌మాద హెచ్చ‌రిక కొన‌సాగుతుండ‌డంతో వరద సహాయచర్యల వేగవంతానికి ఆదేశించారు. అక్క‌డికి అదనంగా రక్షణ సామగ్రి తరలించాలని చెప్పారు. హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచాలని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు.

KCR: హెలికాప్టర్ అందుబాటులో ఉంచండి: వ‌ర‌ద‌ల‌పై స‌మీక్ష‌లో సీఎం కేసీఆర్

Cm Kcr

Updated On : July 15, 2022 / 11:50 AM IST

KCR: తెలంగాణ‌లో వ‌ర‌ద‌ల‌పై అధికారుల‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. భ‌ద్రాచ‌లం వ‌ద్ద మూడో ప్ర‌మాద హెచ్చ‌రిక కొన‌సాగుతుండ‌డంతో వరద సహాయచర్యల వేగవంతానికి ఆదేశించారు. అక్క‌డికి అదనంగా రక్షణ సామగ్రి తరలించాలని చెప్పారు. హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచాలని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. అలాగే, భద్రాచలంలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర మంత్రి పువ్వాడతోనూ కేసీఆర్ మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు.

Godavari Floods: భయం గుప్పిట్లో భద్రాద్రి.. 50ఏళ్ల రికార్డు బ్రేక్ అవుతుందా..!

మ‌రోవైపు, భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మిషన్‌ భగీరథ నీటి సరఫరాను నిలిపివేశారు.ఇంటెల్వెల్, సబ్‌స్టేషన్ వద్దకు వ‌ర‌ద చేరింది. ప‌లు గ్రామాల్లో వరదలో దాదాపు 200 మంది చిక్కుకున్నారు. దీంతో వారిని ర‌క్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కృషి చేస్తున్నాయి. గంటగంటకు గోదావరి నీటిమట్టం భారీగా పెరుగుతోంది. భారీ వ‌ర్షాల‌తో ఉత్త‌ర తెలంగాణ జిల్లాల్లో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారు. అనేక గ్రామాల్లో వ‌ర‌ద‌ల కార‌ణంగా ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కూ ఆటంకాలు క‌లుగుతున్నాయి.