Godavari Floods: భయం గుప్పిట్లో భద్రాద్రి.. 50ఏళ్ల రికార్డు బ్రేక్ అవుతుందా..!

భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం చూస్తుంటే 50ఏళ్ల రికార్డు బ్రేక్ అవుతుందా అని స్థానిక ప్రజలు భయపడుతున్నారు. భద్రాచలంలో 36ఏళ్ల తర్వాత గోదావరి నీటిమట్టం మళ్లీ 70 అడుగులు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే 50ఏళ్ల క్రితం గోదావరి నీటిమట్టం 75 అడుగులకు చేరింది. ఆ రికార్డు ఇప్పుడు బ్రేక్ అవుతుందా అన్న ఆందోళన ప్రజలు, అధికారుల్లో నెలకొంది

Godavari Floods: భయం గుప్పిట్లో భద్రాద్రి.. 50ఏళ్ల రికార్డు బ్రేక్ అవుతుందా..!

Bhadrachalam

Godavari Floods: తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో భారీగా వరదనీరు చేరి ఉగ్రరూపం దాల్చుతోంది. గంటగంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో భద్రాచలం ప్రజలు భయం గుప్పిట్లో వణికిపోతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇప్పటికే 67.10 అడుగులకు చేరుకుంది. భారీగా వరదనీరు వచ్చిచేరుతుండటంతో మధ్యాహ్నం సమయానికి 70అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి వరదల దాటికి ముంపుకు గురవుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భద్రాచలం పట్టణంలో 144 సెక్షన్ విధించారు. ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు భద్రాచలం వద్ద బ్రిడ్జిపై రాకపోకలు నిషేధించారు. మరో 48గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Godavari Floods: ఉగ్ర గోదావరి.. భద్రాద్రి వద్ద 67అడుగులకు చేరిన నీటిమట్టం.. ఏపీలోని లోతట్టు ప్రాంతాల్లో హైఅలర్ట్

భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం చూస్తుంటే 50ఏళ్ల రికార్డు బ్రేక్ అవుతుందా అని స్థానిక ప్రజలు భయపడుతున్నారు. భద్రాచలంలో 36ఏళ్ల తర్వాత గోదావరి నీటిమట్టం మళ్లీ 70 అడుగులు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే 50ఏళ్ల క్రితం గోదావరి నీటిమట్టం 75 అడుగులకు చేరింది. ఆ రికార్డు ఇప్పుడు బ్రేక్ అవుతుందా అన్న ఆందోళన ప్రజలు, అధికారుల్లో నెలకొంది. అదేజరిగితే ముంపు ప్రాంతాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని, భద్రాద్రి పట్టణంలోని పలు ప్రాంతాలు ముంపుకు గురవుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Godavari River : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. 62.80 అడుగులకు చేరిన నీటిమట్టం

ఇప్పటి వరకు భద్రాచలం వద్ద గోదావరి 60 అడుగులకు ఆరుసార్లు చేరింది. రెండు సార్లు 70 అడుగులు క్రాస్ అయింది. 1976లో 63.9అడుగులు, 1983లో 63.5అడుగులు, 1986లో 75.6అడుగులు, 1990లో 70.8అడుగులు, 2006లో 66.9అడుగులు, 2013లో 61.6అడుగులు, 2020లో 61.5అడుగులకు చేరి గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది.