కాఫీ డేకు కొత్త సీఈవోగా మాళవిక హెగ్డే

  • Published By: nagamani ,Published On : December 8, 2020 / 08:46 AM IST
కాఫీ డేకు కొత్త సీఈవోగా మాళవిక హెగ్డే

Updated On : December 8, 2020 / 9:12 AM IST

Bangalore : Coffee Day New CEO Malavika Hegde : కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ సీఈవో వీజీ సిద్ధార్థ మరణం అనంతరం సంవత్సరానికి ఆ సంస్థకు కొత్త సీఈవో వచ్చారు. కర్ణాటక మాజీ సీఎం MS కృష్ణ కుమార్తె, కాఫీడే వ్యవస్థపాకుడు అయిన సిద్ధార్థ భార్య మాళివిక హెగ్డే సంస్థకు కొత్త సీఈవోగా నియమితులయ్యారు.



సీఈవో మాళవికతోపాటు అదనపు డైరెక్టర్లుగా సీహెచ్ వసుంధరా దేవి, గిరి దేవనూర్, మోహన్ రాఘవేంద్ర నియమితులయ్యారు. 2025 వరకు వీరు పదవుల్లో కొనసాగనున్నారు.కాఫీడే సంస్థ నష్టాల్లో కూరుకుపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సిద్ధార్థ గత సంవత్సరం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణానంతరం ఇండిపెండెంట్ బోర్డు సభ్యుడైన ఎస్వీ రంగనాథ్ మధ్యంతర చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.


తాజాగా, ఇప్పుడు పూర్తిస్థాయి సీఈవోగా మాళివిక నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అప్పుల్లో కూరుకుపోయిన కాఫీడేను తిరిగి నిలబెట్టటానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కాగా గత సంవత్సరం కాఫీడే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.




బెగళూరుకు చెందిన కేఫ్ డే దేశ వ్యాప్తంగా వందలాది కాఫీ షాపులను నిర్వహిస్తోంది.