Ali : తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిసిన అలీ..
కమెడియన్ అలీ ఇటీవలే ఏపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో అలీ తెలంగాణ గవర్నర్ ని కలవడం చర్చాంశనీయం అయింది..............

Comedian Ali Met Telangana Governer tamilisai and invites to his daughter marriage
Ali : కొన్ని రోజులుగా తెలంగాణ గవర్నర్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్నట్టు సాగుతున్నాయి పరిస్థితులు. రోజూ గవర్నర్ తమిళిసై వార్తలో నిలుస్తున్నారు. తాజాగా ప్రముఖ కమెడియన్ అలీ తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిశారు. కమెడియన్ అలీ ఇటీవలే ఏపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో అలీ తెలంగాణ గవర్నర్ ని కలవడం చర్చాంశనీయం అయింది.
బుధవారం నాడు అలీ తెలంగాణ గవర్నర్ ని కలిశారు. ఇటీవలే అలీ దంపతుల పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఫాతిమా పెళ్లి జరగనుంది. దీంతో తన కూతురి పెళ్ళికి హాజరు కావాలని గవర్నర్ తమిళిసైని కలిసి శుభలేఖ ఇచ్చి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. పెళ్లి పత్రికను స్వీకరించిన తమిళిసై తప్పకుండా హాజరు అవుతానని తెలిపారు.