Condom Tester: ఎంతో ఇంప్రెస్ అయ్యా.. రకుల్ చెప్తున్న కండోమ్ కహానీ!
పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య దక్షణాది సినిమాల మీద కాస్త కాన్షన్ట్రేషన్ తగ్గించి ఫోకస్ మొత్తం బాలీవుడ్ మీద పెట్టింది. ఇప్పటికే మూడు, నాలుగు సినిమాలను షూటింగ్ ట్రాక్ మీద పెట్టిన రకుల్ మరికొన్ని కథలను కూడా వింటుంది.

Condom Tester
Condom Tester: పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య దక్షణాది సినిమాల మీద కాస్త కాన్షన్ట్రేషన్ తగ్గించి ఫోకస్ మొత్తం బాలీవుడ్ మీద పెట్టింది. ఇప్పటికే మూడు, నాలుగు సినిమాలను షూటింగ్ ట్రాక్ మీద పెట్టిన రకుల్ మరికొన్ని కథలను కూడా వింటుంది. అయితే.. రకుల్ ఒకే చేసిన ఒక సినిమా మీద మాత్రం చాలా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే అందులో రకుల్ పాత్ర కండోమ్ టెస్టర్. పాత్రకు తగ్గట్లే సినిమాలో రకుల్ కూడా చాలా బోల్డ్ గా కనిపిస్తుందట.
దక్షణాదితో పోల్చితే బాలీవుడ్ సినిమాలలో కాస్త లిమిట్స్ మర్చిపోవాలని పేరుంది. రకుల్ కూడా గ్లామర్ డోస్ కు అవకాశం ఉంటే వదులుకునే టైపు కాదు. అలాంటిది సినిమానే కండోమ్ టెస్టర్ కనుక ఈ సినిమాలో బోల్డ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. అయితే.. అసలు రకుల్ ఈ పాత్రకి ఎలా ఒకే చెప్పిందన్నదే కొద్దిరోజులుగా ఆమె అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు ఆ పాత్రకు ఒకే చెప్పడంపై రకుల్ క్లారిటీ ఇచ్చింది.
రకుల్ తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. కండోమ్ టెస్టింగ్ పాత్ర, దర్శకుడు తేజస్ డియోస్కర్ చెప్పిన కథ తనని బాగా ఇంప్రెస్ చేసిందని పేర్కొంది. బోల్డ్ పాత్రే అయినా కూడా మంచి సెన్సిబులిటీ ఉన్న పాత్రగా తాను చేయబోతున్న పాత్ర నిలుస్తుందనే నమ్మకంను ఆమె వ్యక్తం చేసింది. ఇలాంటి సెన్సిబుల్ ప్రాజెక్ట్ లో చేయాలని చాలా కాలంగా అనుకుంటుండగా ఈ అవకాశం వచ్చిందని చెప్పింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న సినిమా ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కే అవకాశం ఉందని పేర్కొంది.