మనుషుల్లాగే పిల్లులకు కరోనా..చప్పుడు లేకుండా అంటించేస్తున్నాయి!

  • Published By: nagamani ,Published On : May 16, 2020 / 06:15 AM IST
మనుషుల్లాగే పిల్లులకు కరోనా..చప్పుడు లేకుండా అంటించేస్తున్నాయి!

Updated On : October 31, 2020 / 2:48 PM IST

మనుషులకు సోకినట్లుగానే పిల్లులకు కూడా కరోనా సోకుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. అలా కరోనా సోకిన పిల్లుల ద్వారా ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతున్నట్లుగా తేలింది. 

చాలా దేశాల్లో పిల్లుల్ని పెంచుకుంటుంటారు. ముద్దు ముద్దుగా పిల్లులను పెంచుకోవటానికి ఇష్టపడతుంటారు. ముఖ్యంగా జపాన్ వంటి దేశాల్లో పిల్లుల్ని పెంచుకోవటం ఎక్కువగా చూస్తుంటాం. పిల్లులంటే వారికి ప్రాణం. ఎంతగా అంటే పిల్లుల పేర్లతో రెస్టారెంట్లు, రైల్వేస్టేషన్లు, దీవులు కూడా ఉన్నాయంటే వారికి పిల్లులంటే ఎంత ఇష్టమో ఊహించుకోవచ్చు. 

దీంతో మనుషులు పెంచుకునే పిల్లులకు కరోనా సోకితే ఏం జరుగుతుంది అనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో షాకింగ్ విషయమేంటంటే..కొన్ని పిల్లులకు కరోనా వైరస్ సోకినట్లుగా గుర్తించారు. కానీ పిలల్లులో కరోనా లక్షణాలు మాత్రం కనిపించట్లేదు. అలా కరోనా వైరస్ సోకిన పిల్లులు…ఇతర పిల్లులకు కరోనా వైరస్‌ను అంటిస్తున్నాయి. అలా ఈ వైరస్ పిల్లుల్లో పాకుతోందని కొత్త పరిశోధనలో తేలింది.

మనుషుల నుంచి జంతువులకు కరోనా సోకుతుందా అనే ప్రశ్న రావటంతో దానిపై కూడా పరిశోధనలు దృష్టి పెట్టారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం..న్యూయార్క్‌లోని బ్రాంక్స్ జూలో… నదియా అనే నాలుగేళ్ల పెద్ద పులికి ఏప్రిల్‌లో కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. 

జూ సిబ్బందికి కరోనా సోకటం..అదే పులికి సోకిందనే అనుమానాలు ఉన్నాయి. అయితే..అలా కరోనా సోకిన ఆ పులి సంరక్షణ బాధ్యతలు చూసేవారికి మాత్రం కరోనా లక్షణాలు లేవు. కానీ కొన్ని వారాల తర్వాత మరికొన్ని పులులకు, సింహాలకు కరోనా సోకినట్లు తెలింది. దీంతో మనుషుల నుంచి జంతువులకు కరోనా సోకుతుందా అనే ప్రశ్నకు సమాధానాలు వెతకటంతో శాస్త్రవేత్తలు బిజీ బిజీగా ఉన్నారు. ఇక..పిల్లులకు కరోనా సోకే విషయానికి వస్తే… బెల్జియంలో ఓ పిల్లికి కరోనా వచ్చింది. దాని యజమానికి కరోనా ఉంది. అతని నుంచే ఆ పిల్లికి కరోనా సోకిందని తేలింది. 

చైనాలో శాస్త్రవేత్తలు కరోనా సోకిన మూడు పిల్లుల్ని ఓ బోనులో ఉంచారు. సోకని పిల్లుల్ని మరో బోన్లలో ఉంచి… సోకిన పిల్లుల పక్కనే వాటి బోన్లను పెట్టారు. అలా కొన్ని వారాలకు ఆ చుట్టూ ఉన్న బోన్లలో ఉన్న పిల్లులన్నింటికీ కూడా కరోనా సోకింది. ఐతే… మూడు పిల్లుల్లో ఒక దాని వల్లే ఈ వైరస్ మిగతా పిల్లులకు పాకిందని తేలింది.

ఈ క్రమంలో అమెరికా, జపాన్ పరిశోధకులు… చేసిన పరిశోధన వివరాల్ని న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో రాశారు. కరోనా బాధితుడి నుంచి వైరస్ సేకరించి..మూడు పిల్లులకు ఎక్కించి వాటిని చారు. బోనుల్లో ఉంచారు. ఆ తరువాత రోజు మరో మూడు బోనుల్లో మరో మూడు పిల్లుల్ని అంటే  కరోనా లేని పిల్లుల్ని ఉంచారు.అలా ఆరు రోజుల తర్వాత ఆ పిల్లులకు పరీక్షలు చేయగా..అన్ని పిల్లులకూ కరోనా సోకినట్లుగా తేలింది. వీటిలో ఏ పిల్లికీ కూడా కరోనా లక్షణాలు కనిపించలేదు.

ఇక్కడ పర్టిక్యులర్ గా గమనించాల్సిన విషయం ఏమిటంటే..కొన్ని రోజుల తర్వాత అన్ని పిల్లులూ కరోనాను జయించాయి.వాటిలో కరోనా వైరస్ లేదు.

ఇలా పలు దేశాల పరిశోధనల్లో తేలిందేమంటే..మనుషుల నుంచి కరోనా వైరస్ పెంపుడు పిల్లులకు వస్తోంది. కానీ ఆ పిల్లుల్లో కరోనా లక్షణాలు కనిపించట్లేదు. కానీ కరోనా సోకిన పిల్లులు మరికొన్ని పిల్లులకు కరోనా అంటించేస్తున్నాయి. అయినా అన్ని పిల్లులూ కరోనాను జయించి… హాయిగా బతికేస్తున్నాయి. కరోనా వచ్చిన ఏ పిల్లీ చచ్చిపోలేదు. చక్కగా బతికేస్తున్నాయి.

ఐతే… పిల్లుల నుంచి కరోనా వైరస్ మనుషులకు సోకట్లేదని కొంతమంది పరిశోధకులు అంటున్నారు. కాబట్టి ఎవరికైనా కరోనా ఉంటే… వారు పిల్లుల దగ్గరకు వెళ్లొద్దనీ, వాటికి అంటించవద్దని కోరుతున్నారు. మొత్తంగా తేలిందేంటి… మనుషుల నుంచి కరోనా వైరస్ పెంపుడు పిల్లులకు వస్తోంది. ఆ పిల్లులకు కరోనా లక్షణాలు కనిపించట్లేదు. వాటి వల్ల మిగతా పిల్లులకూ కరోనా సోకుతోంది. కానీ.. అన్ని పిల్లులూ కరోనాను జయించి… హాయిగా జీవించగలుగుతున్నాయి. ఐతే… పిల్లుల నుంచి కరోనా వైరస్ మనుషులకు సోకటంలేదని ఇప్పటి వరకూ చేసిన పరిశోధనల్లో తేలింది.

Read Here>> coronavirus vaccine సిద్ధం చేసిన సిగరెట్ కంపెనీ.. human trials ఒక్కటే లేట్