కరోనా లేటెస్ట్ అప్‌డేట్: దేశంలో 70వేలకు చేరుకున్న కేసులు.. తెలుగు రాష్ట్రాల్లో..!

  • Published By: vamsi ,Published On : May 12, 2020 / 04:54 AM IST
కరోనా లేటెస్ట్ అప్‌డేట్: దేశంలో 70వేలకు చేరుకున్న కేసులు.. తెలుగు రాష్ట్రాల్లో..!

Updated On : October 31, 2020 / 2:37 PM IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ చివరి వారంలోకి భారత్ ప్రవేశిస్తుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్‌డౌన్ తర్వాత ఏం చేద్దాం అనే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రులను కోరారు. ఇదిలా ఉంటే భారతదేశం 70వేల COVID-19 కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసులు 70,756 కు పెరిగినట్లుగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. 

ఇక గత 24 గంటల్లో 87 మంది మరణించడంతో COVID-19 సంబంధిత మరణాల సంఖ్య 2,293 కు పెరిగింది. భారతదేశంలో మొత్తం యాక్టీవ్‌గా ఉన్న కరోనావైరస్ రోగుల సంఖ్య 46,008గా ఉంది. ఇప్పటివరకు 31శాతం కరోనావైరస్ రోగులు ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. భారత్‌లో 60వేల మార్కును దాటిన రెండు రోజులకే 70వేల మార్కును చేరుకున్నాయి కరోనా కేసులు.

కొవిడ్‌-19 తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌లలో మరణాల రేటు తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో ప్రతిరోజు కొత్తగా వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు వస్తుండగా.. నిన్న ఒక్కరోజే 1230పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,401కి చేరింది. ఇప్పటివరకు ఈ వైరస్‌ సోకిన వారిలో 868 మంది చనిపోయారు. మహారాష్ట్ర సోమవారం 36మంది చనిపోయారు.  భారతదేశంలో 20వేలకి పైగా కరోనావైరస్ కేసులను నివేదించిన ఏకైక రాష్ట్రం మహారాష్ట్ర.

భారతదేశంలో కరోనావైరస్ కేసులు రాష్ట్రాలవారీగా..:

అండమాన్ మరియు నికోబార్ దీవులు – 33
ఆంధ్రప్రదేశ్ – 2,018
అస్సాం – 65
బీహార్ – 747
చంఢీఘర్- 174
ఛత్తీస్‌గఢ్ – 59
దాదర్ నగర్ హవేలి – 1
ఢిల్లీ – 7,233
గుజరాత్ – 8,541
హర్యానా – 730
హిమాచల్ ప్రదేశ్ – 59
జమ్మూ కాశ్మీర్ – 879
జార్ఖండ్ – 160
కర్ణాటక – 862
కేరళ – 519
లడఖ్ – 42
మధ్యప్రదేశ్ – 3,785
మహారాష్ట్ర – 23,401
మేఘాలయ – 13
ఒడిశా – 414
పుదుచ్చేరి – 12
పంజాబ్ – 1,867
రాజస్థాన్ – 3,988
తమిళనాడు – 8,002
తెలంగాణ – 1,275
త్రిపుర – 152
ఉత్తరాఖండ్ – 68
ఉత్తర ప్రదేశ్ – 3,573
పశ్చిమ బెంగాల్ – 2,063

ఆంధ్రప్రదేశ్‌లో 1980, తెలంగాణలో 1196 కేసులు..
తెలుగు రాష్ట్రాల్లో కూడా కొవిడ్‌-19 తీవ్రత కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో కొత్తగా 79 పాజిటివ్‌ కేసులు కనిపించగా.. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1275కి చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 30మంది చనిపోయారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో లేటెస్ట్‌గా 38పాజిటివ్‌ కేసులు రాగా.. బాధితుల సంఖ్య 2018కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 45మంది చనిపోయారు.

ప్రపంచవ్యాప్తంగా 4.1 మిలియన్లకు పైగా COVID-19 కేసులు నమోదవగా.. 2లక్షల 85వేల మంది చనిపోయారు. యునైటెడ్ స్టేట్స్‌లో 1.3 మిలియన్లకు పైగా కేసులు నమోదవగా.. 80వేల మంది చనిపోయారు. కరోనావైరస్ పరీక్షా సామర్థ్యాలను విస్తరించడానికి ఫెడరల్ ప్రభుత్వం రాష్ట్రాలకు billion 11 బిలియన్లను పంపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ప్రకటించారు.

Read More:

మరో 7రోజుల్లో…. దేశంలో 1లక్షకు చేరుకోనున్న కరోనా కేసులు