Chennai : మూడు మతాల పెద్దల పేర్లతో పోలీస్ అధికారి కూతురి పెళ్లి శుభలేఖ

కోయంబత్తూరుకి చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ కూతురి పెళ్లి శుభలేఖ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. మూడు మతాలకు చెందిన పెద్దల పేర్లను కూడా శుభలేఖలో ముద్రించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరంటే?

Chennai : మూడు మతాల పెద్దల పేర్లతో పోలీస్ అధికారి కూతురి పెళ్లి శుభలేఖ

Chennai

Updated On : May 24, 2023 / 12:05 PM IST

Wedding Invitation Viral : కోయంబత్తూరుకి చెందిన పోలీసు అధికారి వెట్రిసెల్వన్‌ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. తన కూతురి పెళ్లి వేడుకను మూడు మతాలకు చెందిన పెద్దల సమక్షంలో జరపడానికి నిర్ణయించారు. ఈ వివాహానికి సంబంధించిన శుభలేఖ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Bareilly: 20 కిలోమీటర్లు చేజ్ చేసి, వరుడిని పట్టుకొచ్చి పెళ్లి చేసుకున్న యువతి

వెట్రిసెల్వన్ కుమార్తె నిషాంతిని పీహెచ్ డీ పూర్తి చేసింది తిరునవ్వేలికి చెందిన సుదర్శన్‌తో ఈమధ్యనే నిశ్చితార్ధం జరిపించారు. వీరి పెళ్లి వేడుకకు ఈనెల 24,25 తేదీలు నిర్ణయించారు. సూలూరులోని కళ్యాణమండపంలో పెళ్లి జరగనుంది. అయితే వీరి పెళ్లిపత్రికలో హిందూ, క్రిస్టియన్, ముస్లిం మతాలకు చెందిన మత గురువుల పేర్లను ముద్రించారు.

 

వెట్రిసెల్వన్ ఇలా వేయించడానికి కారణం లేకపోలేదు. మతపరమైన బెదిరింపులను పర్యవేక్షించే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్‌లో గతంలో వెట్రిసెల్వన్ పనిచేశారు. కోయంబత్తూరులో మత ఘర్షణలు చెలరేగినపుడు పరిస్థితి చక్కదిద్ది శాంతియుత వాతావరణం ఏర్పడటానికి తన వంతు కృషి చేశారు. అందుకుగానూ రాష్ట్రపతి అవార్డు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు కూడా అందుకున్నారు.

Wedding In Space : ఒక్కొక్కరికి రూ.కోటి ఖర్చు పెడితే, ఎంచక్కా..అంతరిక్షంలో పెళ్లి చేసుకోవచ్చు..

అంతేకాకుండా ఆయన స్నేహితుల సర్కిల్‌లో అన్ని మతాలకు చెందిన వారున్నారు. అందుకే తన ఇంటి పెళ్లి పత్రిక అందరికీ స్వాగతం పలికేలా ఉండాలని పెళ్లిపత్రిక అలా ముద్రించినట్లు వెట్రిసెల్వన్ చెప్పారు. మొత్తానికి పోలీస్ అధికారి వెట్రిసెల్వన్ కుమార్తె పెళ్లి శుభలేఖ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ పెళ్లికి పెద్ద ఎత్తున పోలీసు అధికారులు కూడా హాజరుకానున్నారు.