Bareilly: 20 కిలోమీటర్లు చేజ్ చేసి, వరుడిని పట్టుకొచ్చి పెళ్లి చేసుకున్న యువతి

సదరు వ్యక్తి ఆమె రెండున్నరేళ్లుగా రిలేషన్‭షిప్‭లో ఉన్నారు. చాలా ఆటంకాలను దాటుకుని ఇరు వైపుల కుటుంబాల వారిని ఒప్పించారు. భూతేశ్వర్ నాథ్ గుడిలో ఆదివారం పెళ్లి నిశ్చయించుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. తీరా పెళ్లి సమయం రానే వచ్చింది

Bareilly: 20 కిలోమీటర్లు చేజ్ చేసి, వరుడిని పట్టుకొచ్చి పెళ్లి చేసుకున్న యువతి

Uttar Pradesh: కంగనా రనౌత్ నటించిన క్వీన్ సినిమా గుర్తుండే ఉంటుంది. పెళ్లి సమయానికి వరుడు హ్యాండిస్తే ఒక్కతే పారిస్‭కు హనీమూన్‭కు వెళ్తుంది. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక క్వీన్ మాత్రం.. ఒంటరిగా హనీమూన్‭కు వెళ్లేందుకు ఇష్టపడలేదు. హనీమూన్‭ అంటూ వెళ్తే భర్తతోనే వెళ్లాలని బలంగా ఫిక్సైంది. అందుకే పెళ్లి సమయానికి ఉడాయించిన వరుడిని సుమారు 20 కిలోమీటర్లు చేజ్ చేసి మరీ పట్టుకొచ్చి గుడిలో పెళ్లి చేసుకుంది. రాష్ట్రంలోని బరేలీలో జరిగిందీ ఆసక్తికర ఘటన.

IPL2023 Playoffs: వ‌ర్షం వ‌ల్ల ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ర‌ద్దైతే ప‌రిస్థితి ఏంటి..? విజేతను ఎలా నిర్ణ‌యిస్తారు.?

సదరు వ్యక్తి ఆమె రెండున్నరేళ్లుగా రిలేషన్‭షిప్‭లో ఉన్నారు. చాలా ఆటంకాలను దాటుకుని ఇరు వైపుల కుటుంబాల వారిని ఒప్పించారు. భూతేశ్వర్ నాథ్ గుడిలో ఆదివారం పెళ్లి నిశ్చయించుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. తీరా పెళ్లి సమయం రానే వచ్చింది. వధువు సహా అందరూ వచ్చేశారు. అయితే వరుడు మాత్రం కనిపించడం లేదు. చాలా సేపు ఎదురు చూశారు. ఇక ఓపిక నశించి వధువే వరుడికి ఫోన్ చేసింది. తన తల్లిని తీసుకువచ్చేందుకు బుదౌన్ వచ్చానని అతడు సమాధానం చెప్పారు.

Maharshtra : అమ్మ కోసం బావి తవ్విన బుడ్డోడు .. త‌ల్లి నీటి క‌ష్టాలు తీర్చిన కొడుకుపై ప్ర‌శంస‌లు

కానీ వధువుకు ఎందుకో అనుమానం వచ్చింది. వెంటనే బరేలీ నుంచి బదౌన్ బయల్దేరింది. అక్కడి నుంచి భీమోరాకు బస్సు ఎక్కుతుండగా పట్టుకుని వెనక్కి తీసుకువచ్చింది. అక్కడి నుంచి పెళ్లి మండపం వరకు తీసుకురావడానికి ఆమె చాలా సాహసాలే చేయాల్సి వచ్చింది. ముందుగా నిశ్చయించినట్టుగానే భూతేశ్వర్ నాథ్ గుడిలోనే అతడిని పెళ్లి చేసుకుంది. కంగనాలాగ కాదు, భర్తతో కలిసి హనీమూన్ వెళ్లనుంది ఈ క్వీన్.