Anchor Shyamala: క్రికెట‌ర్ భువ‌నేశ్వ‌ర్, శ్యామ‌ల‌ అక్కా తమ్ముడా.. శ్యామల ఏమందంటే?

సోషల్ మీడియాకు ఏదైనా లోకువే.. ఎవరైనా ఒక్కటే. తప్పు.. ఒప్పు.. విషయం ఏంటో తెలుసుకొనేలోపు విషయం ప్రపంచాన్ని చుట్టేస్తోంది. మంచికి ఎంతగా ఉపయోగపడుతుందో చెడుకి అంతకు మించి ఉపయోగించేసే ఒకేఒక్క ఆయుధం సోషల్ మీడియానే

Anchor Shyamala: క్రికెట‌ర్ భువ‌నేశ్వ‌ర్, శ్యామ‌ల‌ అక్కా తమ్ముడా.. శ్యామల ఏమందంటే?

Cricketer Bhubaneswar Anchor Shyamala Brother And Sister Shyamala React On This

Updated On : May 8, 2021 / 11:27 AM IST

Anchor Shyamala: సోషల్ మీడియాకు ఏదైనా లోకువే.. ఎవరైనా ఒక్కటే. తప్పు.. ఒప్పు.. విషయం ఏంటో తెలుసుకొనేలోపు విషయం ప్రపంచాన్ని చుట్టేస్తోంది. మంచికి ఎంతగా ఉపయోగపడుతుందో చెడుకి అంతకు మించి ఉపయోగించేసే ఒకేఒక్క ఆయుధం సోషల్ మీడియానే. ఇక్కడ నిత్యం ఎన్నో అనవసరపు విషయాలు.. అక్కరకురాని సమాచారాలు తెగ చక్కర్లు కొడుతుంటుంటాయి. అలాంటి ఓ ప్రచారమే తెలుగు టెలివిజన్ యాంకర్ శ్యామల.. భారత క్రికెటర్ భువనేశ్వర్ అక్కా తమ్ముడట. గత రెండు రోజులుగా ఈ ప్రచారం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

క్రికెట‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్, యాంక‌ర్ శ్యామ‌ల ఇద్ద‌రిలో కొద్దిగా దగ్గరి పోలిక‌లు ఉంటాయి. అందులో కూడా ఒకేలా పోలికలు కనిపించే కొన్ని ఫోటోలను కలిపి వారిద్ద‌రు తోబుట్టువ‌లే అంటూ ఈ వార్తను దావానంలా వ్యాపింప‌జేశారు. ఈ ప్రచారం మెల్లగా శ్యామ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డంతో ఆమె దీనిపై స్పందించింది. భువ‌నేశ్వ‌ర్, నేను అక్కా త‌మ్ముళ్ల‌మా, ఈ విష‌యం నాకే తెలియ‌దు. వాళ్లకేం తెలుస్తుంది పాపం అంటూ సెటైర్ వేసింది శ్యామ‌ల‌. ఈ వార్త‌లో ఏ మాత్రం నిజం లేద‌ని శ్యామల ఇలా సమాధానం చెప్పుకొచ్చింది.

నిజానికి క్రికెటర్ భువనేశ్వర్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ కాగా యాంకర్ శ్యామల పక్కా గోదావరి జిల్లా ఆడపడుచు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ శ్యామల స్వస్థలం. కానీ కొద్దిగా ముఖంలో పోలికలు ఉన్న పాపానికి ఈ ఇద్దరినీ అక్కా తమ్ముడిని చేసేశారు. ఇప్పటికే ఈ ప్రచారంపై సోషల్ మీడియాలో భయంకరమైన మీమ్స్, కొటేషన్స్ రూపొందించగా చివరికి ఈ ప్రచారంపై శ్యామల వ్యాఖ్యలతో కూడా మీమ్స్ చేసి తెగ ప్రచారం చేసేసుకుంటున్నారు.