Dasoju Shravan Resign : కాంగ్రెస్ కు దాసోజు శ్రవణ్ రాజీనామా..రేవంత్ వల్లే పార్టీ వీడుతున్నా

తెలంగాణ కాంగ్రెస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా హస్తం పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ కు దాసోజు శ్రవణ్ గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు దాసోజు రాజీనామా చేశారు.

Dasoju Shravan Resign : కాంగ్రెస్ కు దాసోజు శ్రవణ్ రాజీనామా..రేవంత్ వల్లే పార్టీ వీడుతున్నా

Dasoju Shravan resign Congress (1)

Updated On : August 5, 2022 / 6:11 PM IST

Dasoju Shravan resign : తెలంగాణ కాంగ్రెస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. వరుసగా నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ఇటీవలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా హస్తం పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ కు దాసోజు శ్రవణ్ గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు దాసోజు రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం(ఆగస్టు5,2022) నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన ప్రకటించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై దాసోజు శ్రవణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వల్లే పార్టీ వదులుతున్నానంటూ ప్రకటించారు. ఏడాదిపాటు కడుపులో దాచుకున్నా..ఇక తన వల్ల కాదన్నారు. రేవంత్ వచ్చాక కులం, ధనం అనే పరిస్థితులు వచ్చాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పార్టీ నేతలను బలహీనపర్చే ప్రయత్నం చేస్తే ఎవరికి చెప్పుకోవాలన్నారు. కంచె చేను మేసినట్లు టీపీసీసీ చీఫ్ పార్టీని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు.

Komatireddy Venkat Reddy : రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ప్రతీ నియోజకవర్గంలో వ్యక్తిగత ప్రాబల్యం కోసం రేవంత్ పాకులాడుతున్నారని విమర్శించారు. ఒక్కో నియోజకవర్గంలో ఐదారుగురిని రేవంత్ ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు. సోబర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాబర్ పార్టీగా మారిపోయిందన్నారు. కాంగ్రెస్ ను రేవత్ ప్రైవేట్ ప్రాపర్టీగా భావిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఫ్రాంఛైజీని కొనుక్కున్నట్టుగా రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.