Dil Raju: చరణ్ సినిమాను పక్కనబెడుతున్న దిల్ రాజు..?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నైజాంలో.....

Dil Raju: చరణ్ సినిమాను పక్కనబెడుతున్న దిల్ రాజు..?

Dil Raju To Keep Ram Charan Aside For Vijay 66

Updated On : April 7, 2022 / 8:38 AM IST

Dil Raju: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసి మంచి లాభాలను అందుకున్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కు గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చారు. ఇక ఆయన ప్రస్తుతం రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చరణ్ 15వ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేశారు.

RC15: శంకర్ హై క్వాలిటీ మేకింగ్.. తడిసి మోపెడవుతున్న బడ్జెట్!

ఇక తమిళ స్టార్ హీరో విజయ్‌తో ఓ తెలుగు-తమిళ ప్రాజెక్టును కూడా పట్టాలెక్కిస్తున్నాడు దిల్ రాజు. విజయ్ కెరీర్‌లో 66వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్నాడు. అయితే ఈ సినిమాతో విజయ్ నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ చేశారు చిత్ర యూనిట్. కాగా ఇప్పుడు ఈ సినిమా కారణంగా దిల్ రాజు చరణ్ నటిస్తున్న సినిమాను పక్కనబెడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Vijay: ఏప్రిల్ తొలివారంలో పట్టాలెక్కనున్న విజయ్-వంశీ మూవీ!

అవును.. విజయ్ 66వ చిత్రాన్ని వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. దీంతో చరణ్ 15వ చిత్రాన్ని సంక్రాంతికి కాకుండా 2023 వేసవిలో రిలీజ్ చేయాలని ఆయన భావిస్తున్నాడట. ఏదేమైనా విజయ్ లాంటి స్టార్ హీరో మూవీ కోసం చరణ్ నటిస్తున్న సినిమాను వాయిదా వేయడం ఏమిటని మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే శంకర్ – చరణ్ కాంబోలో రాబోతున్న సినిమా షూటింగ్ పూర్తయ్యేసరికి చాలా సమయం పడుతుందని, అందుకే విజయ్-వంశీ పైడిపల్లి సినిమాను ముందుగా రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే దిల్ రాజు అధికారికంగా ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్‌ను అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.