Breaking : ఈడీ విచారణకు కెల్విన్ : నందుపై ప్రశ్నల వర్షం

తారల విచారణతో ఈడీ ఆఫీస్ దగ్గర సెక్యూరిటీ పెంచారు పోలీసులు. గతంలోనే అరెస్ట్ అయిన ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు కెల్విన్, జీషాన్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ఇంటరాగేట్ చేస్తున్నారు.

Breaking : ఈడీ విచారణకు కెల్విన్ : నందుపై ప్రశ్నల వర్షం

Drug Peddle Kelvin Nandu Ed

Updated On : September 7, 2021 / 2:58 PM IST

Breaking-Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ సంచలనం రేపుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో మనీ లాండరింగ్, ఫెమా రూల్స్ ఉల్లంఘన,  మత్తు వ్యాపారం మీద ఈడీ దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే ఈ కేసులో.. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి చార్మి, నటి రకుల్ ప్రీత్ సింగ్ లను ఈడీ ఇంటరాగేట్ చేసింది. కేసుకు సంబంధించి వారి నుంచి కీలక ఆధారాలు, డాక్యుమెంట్లు, వాంగ్మూలం తీసుకున్నట్టు తెలుస్తోంది. నటుడు రానా కూడా ఈడీ విచారణకు హాజరుకానున్నారు.

ఇవాళ ఈడీ విచారణకు నటుడు నందు అటెండయ్యాడు. నందును గతంలోనూ… ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ చేశారు. డ్రగ్స్ కేసులో వివరాలు రాబట్టారు. మరో రెండు వారాల తర్వాత.. షెడ్యూల్ లో నందు విచారణ  ఉన్నప్పటికీ.. ఆయన్ను ముందుగానే ఇంటరాగేట్ చేస్తున్నారు ఈడీ అధికారులు.

ఐతే… డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన కెల్విన్ ఇవాళ(7 సెప్టెంబర్ 2021) ఈడీ కార్యాలయానికి వచ్చారు. కెల్విన్ సమక్షంలోనే నందును ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీస్ కు వచ్చాడు నందు. ఆ తర్వాత.. దాదాపు 2 గంటల తర్వాత.. కెల్విన్ వచ్చాడు. డ్రగ్స్ లింకులపై గతంలోనూ నందుపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో… కెల్విన్ ఇచ్చిన సమాచారం, పక్కా ఆధారాలతో నందును ప్రశ్నిస్తున్నట్టు చెబుతున్నారు. ఈనెల 20న నందు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ… ముందుగానే నందును పిలిచి ప్రశ్నిస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 2017 అగస్ట్ 1న ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ విచారణను తొలిసారిగా ఎదుర్కొన్నాడు నందు.

ఈడీ కార్యాలయానికి కెల్విన్ ను CRPF పోలీసులు తీసుకొచ్చారు. కెల్విన్.. ఈ డ్రగ్స్ కేసు మొత్తానికి కీలక నిందితుడు.  బోయిన్ పల్లిలోని కెల్విన్ ఇంటి దగ్గర నుంచి..CRPF పోలీసులు అతడిని ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. నటుడు నందు, కెల్విన్ లను ఇద్దరినీ కలిపి విచారిస్తున్నారు ఈడీ అధికారులు. కెల్విన్ బ్యాంక్ డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. సినీ ప్రముఖులతో సంబంధాలు, బ్యాంక్ లావాదేవీలపై మరోసారి కెల్విన్‌ను ప్రశ్నిస్తున్నారు ఈడీ ఆఫీసర్లు.

తారల డ్రగ్స్ కేసు విచారణతో.. ఈడీ ఆఫీస్ దగ్గర సెక్యూరిటీ పెంచారు పోలీసులు. గతంలోనే అరెస్ట్ అయిన ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు కెల్విన్, జీషాన్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా… స్టార్స్ ను పిలిచి ఈడీ విచారణ జరుపుతోంది.