తమిళనాడు సీఎం రాజీనామా

తమిళనాడు ముఖ్యమంత్రి కే పళనిస్వామి తన పదవికి రాజీనామా చేశారు.

తమిళనాడు సీఎం రాజీనామా

Tamilnadu Cm

Updated On : May 3, 2021 / 9:08 PM IST

Tamilnadu తమిళనాడు ముఖ్యమంత్రి కే పళనిస్వామి తన పదవికి రాజీనామా చేశారు. పళనిస్వామి రాజీనామాని గవర్నర్ బన్వారిలాల్​ పురోహిత్ ఆమోదించారు. ఇది సోమవారం ( మే-3) నుంచే అమల్లోకి వస్తుందని గవర్నర్ తెలిపారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు పళనిస్వామిని ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ కోరారు.

సీఎం రాజీనామా నేపథ్యంలో 15వ(2016-2021) అసెంబ్లీని గవర్నర్​ రద్దు చేసినట్లు రాజ్​భవన్ పేర్కొంది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు పళనిస్వామిని ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ కోరారు.

కాగా, ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకు గానూ.. 133 సీట్లు సాధించిన ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అధికార అన్నాడీఎంకే 66 స్థానాలకే పరిమితమై ఓటమి పాలైంది.

ఇక,దశాబ్దాకాలం తర్వాత డీఎంకే అధికారంలోకి రావడంతో..ఎంకే స్టాలిన్ తొలిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. డీఎంకే పార్టీ నుంచి కురుణాధి తర్వాత ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్న వ్యక్తి కూడా స్టాలినే కావడం విశేషం.