Ravi Kishan: రేసుగుర్రం విలన్ ఇంట విషాదం!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘రేసుగుర్రం’ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా బన్నీ కెరీర్‌లో ఓ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలవడమే....

Ravi Kishan: రేసుగుర్రం విలన్ ఇంట విషాదం!

Elder Brother Of Actor Ravi Kishan Died Due To Cancer

Updated On : March 31, 2022 / 5:44 PM IST

Ravi Kishan: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘రేసుగుర్రం’ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా బన్నీ కెరీర్‌లో ఓ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలవడమే కాకుండా ఆయన ఖాతాలో సెన్సేషనల్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన రవికిషన్‌కు తెలుగులో మంచి గుర్తింపు లభించిందని చెప్పాలి. ఆయన చేసిన ‘మద్దాలి శివారెడ్డి’ పాత్ర, ప్రేక్షకులకు ఆయన చేసిన చిత్రాల్లో ఆల్‌టైమ్ ఫేవరెట్ పాత్ర అంటే ఆ సినిమాలో రవికిషన్ ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.

Ravikishan : గ్రామంలో స్వయంగా శానిటైజ్​ చేసిన ప్రముఖ నటుడు,ఎంపీ రవికిషన్

ఇక ఆ తరువాత పలు తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఈ భోజ్‌పురి నటుడు. అంతేగాక 2019లో రవికిషన్ బీజేపీ తరఫున గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందాడు. ప్రస్తుతం ఆయన ఎంపీగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా రవి కిషన్ ఇంట విషాదం నెలకొంది. రవికిషన్ సోదరుడు రమేష్ శుక్లా బుధవారం కన్నుమూశారు. గతకొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన, చికిత్స తీసుకుంటున్నారు. కాగా పరిస్థితి విషమించడంతో ఆయన బుధవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తన అన్న ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించారని.. కానీ ఆయన్ను వారు కాపాడలేకపోయారని రవికిషన్ పేర్కొన్నాడు.

ఇటీవల తన తండ్రిని పోగొట్టుకున్న రవికిషన్, తాజాగా తన సోదరుడుని కూడా కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది. తన కుటుంబం అనాథగా మారిందంటూ ఎమోషనల్ అయ్యారు రవికిషన్. తన అన్న ఆత్మకు శాంతి చేకూరాలని రవికిషన్ ఈ సందర్భంగా కోరారు. రవికిషన్ సోదరుడి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.