Fasting : గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఉపవాసం!

అల్జీమర్స్ , స్ట్రోక్ నుండి రక్షించటానికి ; ఉపవాసం స్ట్రోక్ మరియు అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలో కనుగొన్నారు. నాడీ సంబంధిత పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడానికి స్వల్పకాలిక మెదడు-బూస్టర్‌గా దోహదం చేస్తుంది.

Fasting : గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఉపవాసం!

Fasting

Updated On : June 21, 2022 / 4:21 PM IST

Fasting : ఉపవాసం చేయటం వల్ల శరీరంలో పేరుకుపోతూ ఉండే పాడైన, చనిపోయిన కణాలను శరీరం తనంతట తానుగా తొలగించుకుంటుంది. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఏమి తినకపోవటాన్ని ఉపవాసం అంటారు. పురాణకాలం నుండి ఉపవాసం మన సంస్కృతిలో భాగమై పోయింది. అయితే ఇటీవలి కాలంలో మారిన జీవనశైలితో ఉపవాసం ఉండే వారే కరువయ్యారు. అయితే ఉపవాసం ఉండటం వల్ల అనేక ప్రాణాంతక రోగాలను దరిచేరకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఉపవాసం హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. ఎందుకంటే ఇది ఊబకాయం, అధిక రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ మరియు మధుమేహం వంటి హృదయ ప్రమాద కారకాలను తగ్గిస్తుంది. అందువల్ల గుండె ఆరోగ్యానికి ఉపవాసం అనేది ఉత్తమమైనదిగా చెబుతున్నారు.

టైప్ 2 డయాబెటిస్‌కు ఉపవాసం; టైప్ 2 డయాబెటిస్‌కు మంచిగా ఉపవాసం దోహదం చేస్తుంది. బరువు తగ్గడంలో ఉపవాసం సహాయపడుతుంది, ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. ఆకలి ,వాపు స్థాయిలను ప్రభావితం చేసే కొవ్వు కణాల ద్వారా విడుదలయ్యే హార్మోన్‌లను అనుకూలంగా ప్రభావితం చేస్తుంది. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, వైద్యుల సూచనలు , సలహాలు తీసుకుని మాత్రమే ఉపవాసం చేయటం మంచిది.

అల్జీమర్స్ , స్ట్రోక్ నుండి రక్షించటానికి ; ఉపవాసం స్ట్రోక్ మరియు అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలో కనుగొన్నారు. నాడీ సంబంధిత పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడానికి స్వల్పకాలిక మెదడు-బూస్టర్‌గా దోహదం చేస్తుంది. అదేక్రమంలో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నవారు ఉపవాసం చేయటం వల్ల కాలేయ పనితీరులో అనేక మార్పులు వచ్చినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

అయితే ఉపవాసం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఉపవాసం విషయంలో వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది. వారానికి ఒకరోజు ఉపవాసం మంచిదే కానీ దీర్ఘకాలం ఉపవాసాల వల్ల శక్తీ సన్నగిల్లి అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.