శింబు మ్యారేజ్ పై తండ్రి రాజేంద్రర్ ఏం చెప్పారంటే

  • Published By: madhu ,Published On : June 8, 2020 / 04:37 AM IST
శింబు మ్యారేజ్ పై తండ్రి రాజేంద్రర్ ఏం చెప్పారంటే

Updated On : June 8, 2020 / 4:37 AM IST

నయనతారతో శింబు పెళ్లి వార్తలపై ఆయన తండ్రి రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. శింబు పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, వాటిని నమ్మవద్దంటూ అభిమానులను కోరారు. ఇప్పటివరకు శింబు పెళ్లిపై ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని, శింబుకు సరిపోయే సరైన జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. జాతకాలు కలిసే అమ్మాయి దొరికితే.. మేమే అందరికీ తెలియజేస్తామని, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మకుండా వేచి చూడాలంటూ ఓ పత్రికా ప్రకటనను సైతం విడుదల చేశారు. 

శింబు మ్యారేజ్ పై గతంలో కూడా అనేక వార్తలు వచ్చాయి. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ నయన తార తో ప్రేమలో పడ్డాడని, ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనే వదంతలు వ్యాపించాయి. పెళ్లి చేసుకుంటారని అనుకొనే సరికి వీరిద్దరూ మనస్పర్థలతో విడిపోయినట్లు టాక్. లాక్ డౌన్ అనంతరం మాజీ ప్రేయసి నయనతో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. ఈ విషయంపై స్వయంగా శింబు ఫాదర్ రెస్పాండ్ కావడం గమనార్హం. 

Read: కన్నడ చిరంజీవి ఇక లేరు: అల్లు శిరీష్