Gujarat Assembly polls-2024: వారు చెప్పినవి విని బాధేసింది: రాహుల్ గాంధీ

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సూరత్ జిల్లాలోని మహువాలో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. తాను నిర్వహిస్తోన్న భారత్ జోడో యాత్రలో భాగంగా దేశంలోపి రైతులు, యువత, గిరిజనులతో మాట్లాడి వారి బాధలు తెలుసుకుంటున్నానని, వారు చెప్పినవి విని బాధేసిందని అన్నారు.

Gujarat Assembly polls-2024: వారు చెప్పినవి విని బాధేసింది: రాహుల్ గాంధీ

Savarkar betrayed Mahatma Gandhi says Rahul Gandhi

Updated On : November 21, 2022 / 5:46 PM IST

Gujarat Assembly polls: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సూరత్ జిల్లాలోని మహువాలో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. తాను నిర్వహిస్తోన్న భారత్ జోడో యాత్రలో భాగంగా దేశంలోపి రైతులు, యువత, గిరిజనులతో మాట్లాడి వారి బాధలు తెలుసుకుంటున్నానని, వారు చెప్పినవి విని బాధేసిందని అన్నారు.

గిరిజనులు దేశానికి మొట్టమొదటి యజమానులని చెప్పారు. బీజేపీ గిరిజనుల హక్కులను దూరం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ వాళ్లు గిరిజనులను వనవాసులని అంటున్నారని అన్నారు. గిరిజనులు నగరాల్లో నివసించకూడదని, గిరిజనుల పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు, పైలట్లు కావద్దని, ఇంగ్లిష్ లో మాట్లాడవద్దని చెప్పారు. గిరిజనులు అడవిలోనే ఉండాలని బీజేపీ వాళ్లు కోరుకుంటున్నారని ఆరోపించారు.

అక్కడితో ఆగకుండా, గిరిజనుల నుంచి అడవిని కూడా లాక్కోవడానికి ప్రయత్నిస్తారని చెప్పారు. ఈ పరంపర ఇలాగే కొనసాగితే పదేళ్లలో ఈ అడవులు అన్నీ ఇద్దరు-ముగ్గురు పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్లిపోతాయని అన్నారు. గిరిజనులు ఉండేందుకు స్థలం దొరకదని చెప్పారు. గిరిజనులకు విద్య, వైద్యం, ఉద్యోగాలు దక్కవని అన్నారు.

భారత్ ను ఏకం చేసేందుకు తాను చేస్తున్న భారత్ జోడో యాత్రలో రైతులు, యువత, గిరిజనుల కష్టాల గురించి తెలుసుకుంటున్నానని చెప్పారు. కాగా, 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో డిసెంబరు 1, 5న ఎన్నికలు జరుగుతాయి. వాటి ఫలితాలు డిసెంబు 8న వెలువడుతాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..