FCI Job Vacancies : ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ ఖాళీల భర్తీ
జోన్ల వారీగా పోస్టుల వివరాలను పరిశీలిస్తే నార్త్ జోన్ లో 2388 ఖాళీలు, సౌత్ జోన్ 989 ఖాళీలు, ఈస్ట్ జోన్ 768 ఖాళీలు, వెస్ట్ జోన్ 713 ఖాళీలు, నార్త్ ఈస్ట్ జోన్ 185 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి డిగ్రీ, బీస్సీ, బీకాం, బీస్సీ, బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

FOOD Corporation of India
FCI Job Vacancies : న్యూఢిల్లీలోని పుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఎఫ్ సీఐ డిపోలు, కార్యాలయాల్లో జోన్ల వారీగా కేటగిరి -3 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టుల ఖాళీలకు సంబంధించి జూనియర్ ఇంజినీర్ సివిల్ ఇంజనీరింగ్, జూనియర్ ఇంజినీర్ ఎలక్ర్టికల్ మెకానికల్ ఇంజనీరింగ్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – 2, అసిస్టెంట్ గ్రేడ్ – 3 జనరల్, అసిస్టెంట్ గ్రేడ్ – 3 అకౌంట్స్, అసిస్టెంట్ గ్రేడ్ – 3 టెక్నికల్, డిపో, హిందీ విభాగాల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయి.
జోన్ల వారీగా పోస్టుల వివరాలను పరిశీలిస్తే నార్త్ జోన్ లో 2388 ఖాళీలు, సౌత్ జోన్ 989 ఖాళీలు, ఈస్ట్ జోన్ 768 ఖాళీలు, వెస్ట్ జోన్ 713 ఖాళీలు, నార్త్ ఈస్ట్ జోన్ 185 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి డిగ్రీ, బీస్సీ, బీకాం, బీస్సీ, బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఫేజ్ -1, పేజ్ -2 పరీక్షలతోపాటు స్కిల్ ,టైపింగ్ టెస్ట్ (స్టెనో) ఆధారంగాఎంపిక చేస్తారు.
అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 6 సెప్టెంబర్ 2022 ప్రారంభమై, 5 అక్టోబర్2022 తేదితో ముగుస్తుంది. తెలుగు రాష్ర్టాల్లో పరీక్షా కేంద్రాలు (ఫేజ్ -1 ఎగ్జామ్): నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://www.recruitmentfci.in పరిశీలించగలరు.