Lal Bahadur Shastri: మోదీజీ.. మా తాతయ్య మృతిపై విచారణ జరిపించండి: లాల్‌బహదూర్ శాస్త్రి మనవడు
అది 1966 జనవరి 11.. అప్పటి భారత ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి సోవియట్ యూనియన్ లో ఉన్నారు. తాష్కెంట్‌లో అదేరోజు లాల్‌బహదూర్ శాస్త్రి మృతి చెందారు. ఆయన మరణంపై ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయి. తాజాగా, అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ మాజీ అధికారి రాబర్ట్ క్రౌలీ ఓ పుస్తకంలో సంచలన విషయం రాసుకొచ్చారు. లాల్‌బహదూర్ శాస్త్రి మృతికి కారణం సీఐఏ అని చెప్పారు. దీనిపై విచారణ జరిపించాలని లాల్‌బహదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి డిమాండ్ చేశారు.

Shastri
Lal Bahadur Shastri: అది 1966 జనవరి 11.. అప్పటి భారత ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి సోవియట్ యూనియన్ (యూనియన్ ఆఫ్ సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్-యూఎస్ఎస్ఆర్)లో ఉన్నారు. భారత్-పాక్ యుద్ధం ముగిసిన తర్వాత ఆయన ఈ పర్యటన జరిపారు. 1966 జనవరి 10న యుద్ధానికి సంబంధించిన ఓ ఒప్పందం మీద సంతకాలు చేసి అధికారికంగా యుద్ధాన్ని ముగించారు. ఆ తదుపరి రోజే తాష్కెంట్‌లో లాల్‌బహదూర్ శాస్త్రి మృతి చెందారు. ఆయన మరణంపై ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయి.
శాస్త్రి గుండెపోటు కారణంగానే మరణించారని సోవియెట్ అధికారులు చెప్పినప్పటికీ దానిపై పూర్తి స్థాయిలో స్పష్టతనిచ్చి, అనుమానాలను నివృత్తి చేయడంలో అప్పటి భారత ప్రభుత్వం కూడా విఫలమైంది. దీంతో అనుమానాలు పెరిగిపోయాయి. ఆయన మరణంపై ఇప్పటికీ సందేహాలు ఉన్నాయి. తాజాగా, అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ మాజీ అధికారి రాబర్ట్ క్రౌలీ ఓ పుస్తకంలో సంచలన విషయం రాసుకొచ్చారు. లాల్‌బహదూర్ శాస్త్రి మృతికి కారణం సీఐఏ అని చెప్పారు. దీంతో ఆయన మృతి అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
దీనిపై విచారణ జరిపించాలని లాల్‌బహదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి డిమాండ్ చేశారు. సీఐఏ మాజీ అధికారి రాబర్ట్ క్రౌలీ చేసిన వ్యాఖ్యలను తన ట్విటర్ ఖాతాలో విభాకర్ శాస్త్రి పోస్ట్ చేశారు. ”లాల్‌బహదూర్ శాస్త్రి మృతి కేసులో విచారణ జరపడానికి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాని కోరుతున్నాను. లాల్‌బహదూర్ శాస్త్రి ఎలా చనిపోయారన్న ప్రశ్నకు సమాధానం కావాలని ప్రతి భారతీయుడు కోరుతున్నాడు. ఆ రోజు రాత్రి మా తాతయ్య శాస్త్రిజీకి ఏం జరిగింది” అని విభాకర్ శాస్త్రి ప్రశ్నించారు.
मैं प्रधानमंत्री श्री @narendramodi जी व ग्रह मंत्री @AmitShah जी से निवेदन करता हूँ की पूर्व प्रधानमंत्री स्व• लाल बहादुर शास्त्री जी के रहस्यमय मौत की जाँच नए सिरे से करवाई जाए,इसका जवाब केवल शास्त्री परिवार नही बल्कि समस्त देशवासी जानना चाहते है की आखिर उनके साथ क्या हुआ था। https://t.co/7jQsTGk5Jt
— Vibhakar Shastri (@VShastri_INC) July 19, 2022