మారుతి సుజుకి మాజీ ఎండీ కన్నుమూత

మాజీ బ్యూరోక్రాట్, మారుతి సుజుకి ఆటోమొబైల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ కట్టర్ సోమవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు.

మారుతి సుజుకి మాజీ ఎండీ కన్నుమూత

Maruti Suzuki Md Jagdish Khattar

మాజీ బ్యూరోక్రాట్, మారుతి సుజుకి ఆటోమొబైల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ కట్టర్ సోమవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు. పాకిస్తాన్ లో జన్మించిన కట్టర్.. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) లో పనిచేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి విద్యను పూర్తి చేసిన ఆయన.. IAS గా యుపి, పిఎస్‌యులలో, ప్రభుత్వ బోర్డులలో వివిధ ఉన్నత స్థాయి అడ్మినిస్ట్రేటివ్ పోస్టులలో పనిచేశారు. 1993 నుండి మారుతి ఉద్యోగ్‌లో మార్కెటింగ్ డైరెక్టర్‌గా చేరడానికి ముందు స్టీల్ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు.

ఆ తరువాత 1999 లో మారుతి సుజుకి కంపెనీకి ఎండి అయ్యారు. కొత్త కొత్త మోడల్ కార్లు మార్కెట్లోకి వస్తున్నప్పటికీ ఆయన నాయకత్వంలో మారుతి కంపెనీ తన మార్కెట్ ను పటిష్టం చేసుకుంది. ఇవాళ మారుతి సుజుకి కంపెనీ ఒక గొప్ప స్థాయిలో ఉంది అంటే దానికి జగదీష్ కట్టర్ సేవలు కూడా ఒక కారణం అంటారు మార్కెట్ నిపుణులు. కట్టర్ హయాంలోనే మారుతి ఆల్టో, స్విఫ్ట్‌ కార్లు తయారు అయ్యాయి. 2007 లో పదవీ విరమణ చేసిన తరువాత, పాన్ ఇండియా మల్టీ-బ్రాండ్ ఆటోమొబైల్ సేల్స్ అండ్ సర్వీసెస్ సంస్థ ‘కార్నేషన్’ ను ప్రారంభించారు.