Karnataka Accident : అతివేగం,నిర్లక్ష్యానికి ఇద్దరు మహిళలు సహా నలుగురు మృతి

అతివేగానికి..నిర్లక్ష్యానికి మరో నాలుగు ప్రాణాలు బలి అయిపోయాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలతో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు

Karnataka Accident : అతివేగం,నిర్లక్ష్యానికి ఇద్దరు మహిళలు సహా నలుగురు మృతి

Karnataka Accident

Updated On : January 8, 2022 / 2:02 PM IST

Karnataka Accident :అతివేగానికి..నిర్లక్ష్యానికి మరో నాలుగు ప్రాణాలు బలి అయిపోయాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలతో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం (జనవరి 7,2022) రాత్రి ట్రక్కు, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలు సహా నలుగురు వ్యక్తులు మరణించారు.

AP Night Curfew: ఏపీలో నైట్ కర్ఫ్యూ పై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

ట్రక్ డ్రైవర్ అతివేగం,నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ ఢీ కొనడంతో కారు పూర్తిగా ధ్వంసం అయ్యిదని పోలీసులు వెల్లడించారు. లారీ ముందున్న మరో లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మహిళలతో సహా నాలుగు ప్రాణాలు బలి అయ్యాయి.

Child Dead : ముక్కు సర్జరీకి వెళ్తే ప్రాణమే పోయింది.. ప్రైవేట్ హాస్పిటల్ లో దారుణం.. !

ఈ ప్రమాదంపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ వెస్ట్ కుల్దీప్ జైన్ మాట్లాడుతు..”బెంగళూరులోని పూర్వాంకర అపార్ట్‌మెంట్ సమీపంలోని నైస్ రోడ్డులో ఒక పెద్ద ప్రమాదం జరిగిందని..ఓ వేగంగా వచ్చి ట్రక్కు వాహనాలను ఢీకొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయాలైనవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నామని మృతుల వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపారు.