AP Night Curfew: నైట్ కర్ఫ్యూ అనేది ఫేక్ ప్రచారం : ఏపీ సర్కారు క్లారిటీ

ఏపీలో నైట్ కర్ఫ్యూ అంటూ జరిగిన ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

AP Night Curfew: నైట్ కర్ఫ్యూ అనేది ఫేక్ ప్రచారం : ఏపీ సర్కారు క్లారిటీ

Ap Night Curfew

Ap Night Curfew : ఏపీలో నైట్ కర్ఫ్యూ అంటూ ప్రచారం జరిగింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుతున్న క్రమంలో ఏపీలో నైట్ కర్ఫ్యూ ఉంటుందనే ప్రచారం జరిగిన క్రమంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

ఏపీ రాష్ట్రంలో ఎటువంటి నైట్ కర్ఫ్యూ లేదని అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఇటువంటి రాంగ్ మెసేజ్‌లు సర్క్యులేట్ చేస్తున్నారని ఇటువంటివారి గురించి ఆరా తీస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఇటువంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. ఇటువంటి అసత్య ప్రచారాలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కాగా..రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.

Prathani Ramakrishna : ఏపీ ప్రభుత్వ టికెట్ రేట్ల విధానం బాగుంది.. తెలంగాణలో కూడా అలాగే ఉండాలి

థర్డ్ వేవ్ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ రోజురోజుకు భారీగా పెరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించిదనే ప్రచారాలు జరిగాయి. శనివారం (జనవరి 8) నుంచే కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయని..ఇకపై ప్రతి రోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు జగన్ సర్కారు ప్రకటించినట్లుగా పలు ప్రచారాలు జరిగాయి.

Pigeon Race: తమిళనాడు వాసులు మెచ్చిన పావురం పందాలు

కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఏపీకి పక్కనే ఉండే తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్ సైతం నైట్ కర్ఫ్యూ అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించిందనే ప్రచారాలు కొనసాగుతున్న క్రమంలో ప్రభుత్వం స్పందించి ఎటువంటి కర్ఫ్యూ లేదని స్పష్టంచేసింది.