Prathani Ramakrishna : ఏపీ ప్రభుత్వ టికెట్ రేట్ల విధానం బాగుంది.. తెలంగాణలో కూడా అలాగే ఉండాలి

గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరలు చర్చాంశనీయంగా మారాయి. తెలంగాణాలో టికెట్ రేట్లు భారీగా పెరిగితే ఏపీ టికెట్ రేట్లు భారీగా తగ్గాయి. దీనిపై సినీ......

Prathani Ramakrishna : ఏపీ ప్రభుత్వ టికెట్ రేట్ల విధానం బాగుంది.. తెలంగాణలో కూడా అలాగే ఉండాలి

Prathani Ramakrishna

Prathani Ramakrishna :  గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరలు చర్చాంశనీయంగా మారాయి. తెలంగాణాలో టికెట్ రేట్లు భారీగా పెరిగితే ఏపీ టికెట్ రేట్లు భారీగా తగ్గాయి. దీనిపై సినీ ప్రముఖులు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ విధానాలని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అలాగే తెలంగాణలో భారీగా టికెట్ రేట్లు పెరగడం కూడా వ్యతిరేకిస్తున్నారు. కానీ కొంతమంది తెలంగాణ భారీ రెట్లని చూపించి ఏపీ సినిమా టికెట్ ధరల్ని సమర్థిస్తున్నారు.

Allu Arjun : ‘పుష్ప’ సినిమా.. థియేటర్లో ఒక ప్రింట్.. ఓటీటీలో మరో ప్రింట్

తాజాగా ఈ అంశంపై తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రెస్ మీట్ పెట్టి కామెంట్స్ చేశాడు. ఈ ప్రెస్ మీట్ లో ప్రతాని రామకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు చిన్న సినిమాలకు అనూకూలంగా లేవు. ప్లాట్ సిస్టమ్ ను తీసెయాలి. టికెట్ల రేట్ల మీద అత్యాశతో కొందరు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. లీజ్ సిస్టమ్ మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. చిన్న సినిమాల విడుదలకు లీజుదారులు వల్ల ఇబ్బందులున్నాయి. ఇండస్ట్రీలో చిన్న సినిమాలు తీసే వారే ఎక్కువ ఉన్నారు. ఈ విషయాలన్నింటిని సిఎం‌ కేసిఆర్ దృష్టి కి తీసుకువెళ్తాను. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల విధానం బాగుంది. ఏరియా వైజ్ టికెట్ ధరల నిర్ణయం‌ మంచిదే. ఆ విధానం తెలంగాణలో కూడా రావాలి” అని అన్నారు.