Bhargav Arrested : దిశ చట్టం కింద టిక్‌టాక్ స్టార్ భార్గవ్ అరెస్ట్..
ఫన్ బకెట్ తో పాపులర్ అయిన టిక్‌టాక్ స్టార్ భార్గవ్‌ను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను మాయ మాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసిన కేసులో అతను అరెస్ట్ అయ్యాడు..

Fun Bucket Bhargav Arrested On Disha Act
Bhargav Arrested: ఫన్ బకెట్ తో పాపులర్ అయిన టిక్‌టాక్ స్టార్ భార్గవ్‌ను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను మాయ మాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసిన కేసులో అతను అరెస్ట్ అయ్యాడు.. ప్రేమ పేరుతో తనను లోబరుచుకుని, గర్భవతిని చేశాడంటూ సదరు బాలిక దిశ పోలీసులను ఆశ్రయించింది. దీంతో భార్గవ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్‌లో అతణ్ణి అదుపులోకి తీసుకున్నారు.
మే 3వ తేది వరకు రిమాండ్ విధించారు. ఫన్ బకెట్‌తో ప్రోగ్రామ్‌లో కామెడీతో నెటిజన్లను ఆకట్టుకున్న భార్గవ్ టిక్‌టాక్ వీడియోల ద్వారా పాపులర్ అయ్యాడు.. అయితే టిక్‌టాక్ బ్యాన్ చెయ్యడంతో మోజో, రెపోసో వంటి యాప్‌లలో కొద్దికాలంగా వీడియోలు చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే, భార్గవ్‌ను విశాఖపట్నం పోలీసులు హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చెయ్యబోతున్నారు.. ఆ వీడియో షూట్ చెయ్యడానికి వెళ్తున్నానంటూ యూట్యూబ్ ఇంటర్వూల ద్వారా పాపులర్ అయిన యాంకర్ శివ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. 376, 354C-IPC, 6,5(J) (II) (L)-POCSO ACT 2012 ఈ సెక్షన్లతో అతణ్ణి అరెస్ట్ చెయ్యబోతున్నారని పేర్కొన్నాడు.. అయితే భార్గవ్ అరెస్ట్ విషయం శివకు ముందే ఎలా తెలిసింది?.. దీన్ని బట్టి అతని అరెస్ట్ వెనుక ఏదో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉండే ఉంటుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..