cab charges: క్యాబ్ సంస్థల అధిక ఛార్జీల బాదుడుపై కేంద్రం దృష్టి
క్యాబ్‌లతోపాటు టూ వీలర్ ట్యాక్సీలపై వినయోగారుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. ఇష్టానుసారం అధిక చార్జీలు వసూలు చేస్తుండటంపై క్యాబ్‌ల నిర్వహణా సంస్థలకు పలు సూచనలు చేసింది.ola

Cabs
cab charges: క్యాబ్‌లతోపాటు టూ వీలర్ ట్యాక్సీలపై వినయోగారుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. ఇష్టానుసారం అధిక చార్జీలు వసూలు చేస్తుండటంపై క్యాబ్‌ల నిర్వహణా సంస్థలకు పలు సూచనలు చేసింది. ఏ పద్ధతిలో ఛార్జీలు వసూలు చేస్తున్నారో, దానికి సంబంధించిన అల్గారిథమ్స్ ఏంటో చెప్పాలని ఆయా సంస్థలను ఆదేశించింది. స్పష్టమైన చార్జీల విధానాన్ని రూపొందించాలని సూచించింది. ఈ అంశంపై కేంద్ర వినియోగదారుల వ్యవహరాల శాఖ కార్యదర్శి రోహిత్ సింగ్ ఆధ్వర్యంలో క్యాబ్ నిర్వహణా సంస్థలతో వచ్చేవారం సమావేశం జరగనుంది.
Govt Into E-commerce : ఈ-కామర్స్ వ్యాపారంలోకి ప్రభుత్వం..! అందుబాటులోకి ONDC ఆన్ లైన్ పోర్టల్
ఓలా, ఉబర్, మేరు క్యాబ్స్, జుగ్ను వంటి సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. క్యాబ్ నిర్వహణా సంస్థలు అధిక చార్జీల వసూలు చేస్తుండటంపై కొంతకాలంగా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీనిపై కేంద్రం స్పందించింది. ఒక నిర్ణీత దూరానికి మొదటి సారి ఒక ప్రయాణికుడి నుంచి తక్కువ వసూలు చేస్తే.. అదే దూరానికి రెగ్యులర్‌గా వెళ్లే ప్రయాణికుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ అంశంతోపాటు క్యాన్సిలేషన్ చార్జీలు, అదనపు సేవల కోసం అదనపు ఛార్జీలు వంటి అంశాలపై కూడా కేంద్రం చర్చిస్తుంది.