Gujarat polls-2022: ఎన్నికల సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తుండగా ఆసక్తికర ఘటన
ప్రజల్లో నుంచి ఓ వ్యక్తి లేచి రాహుల్ గాంధీ ప్రసంగానికి అడ్డుతగిలి, ఓ విజ్ఞప్తి చేశాడు. ‘‘మీరు హిందీలో మాట్లాడండి.. మాకు ఆ భాష అర్థమవుతుంది. మళ్ళీ దాన్ని అనువాదించి ఇంకొకరు చెప్పే అవసరం లేదు’’ అని ఆ వ్యక్తి అన్నాడు. దీంతో రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ఆపారు. ‘‘హిందీలో మాట్లాడితే ఓకేనా?’’ అని ప్రశ్నించారు. దీంతో ప్రజలంతా అందుకు అంగీకరిస్తూ సంకేతాలు ఇచ్చారు. అనువాదం చేస్తున్న వ్యక్తి మైకును వదిలేసి వెనకకు వెళ్లి కూర్చున్నారు.

Gujarat polls-2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సూరత్ జిల్లాలోని మహువాలో నిర్వహించిన సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ హిందీలో ప్రసంగిస్తుండగా ఓ నేత గుజరాతీ భాషలో అనువాదం చేసి ప్రజలకు వినిపిస్తున్నారు. ఆ సమయంలో ప్రజల్లో నుంచి ఓ వ్యక్తి లేచి రాహుల్ గాంధీ ప్రసంగానికి అడ్డుతగిలి, ఓ విజ్ఞప్తి చేశాడు.
‘‘మీరు హిందీలో మాట్లాడండి.. మాకు ఆ భాష అర్థమవుతుంది. మళ్ళీ దాన్ని అనువాదించి ఇంకొకరు చెప్పే అవసరం లేదు’’ అని ఆ వ్యక్తి అన్నాడు. దీంతో రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ఆపారు. ‘‘హిందీలో మాట్లాడితే ఓకేనా?’’ అని ప్రశ్నించారు. దీంతో ప్రజలంతా అందుకు అంగీకరిస్తూ సంకేతాలు ఇచ్చారు.
అనువాదం చేస్తున్న వ్యక్తి మైకును వదిలేసి వెనకకు వెళ్లి కూర్చున్నారు. రాహుల్ గాంధీ హిందీలో ప్రసంగాన్ని కొనసాగించారు. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఎన్నికలు రెండు దశల్లో (డిసెంబరు 1, 5న) జరుగుతాయి. హిమాచల్ ప్రదేశ్ తో పాటు గుజరాత్ ఎన్నికల ఫలితాలు డిసెంబరు 8న వెలువడుతాయి.
LIVE: Shri @RahulGandhi addresses public rally in Surat, Gujarat. #CongressAaveChe https://t.co/lzBu1bJjKn
— Congress (@INCIndia) November 21, 2022