Pak Journalist Row: నేను ఎన్నడూ అతడిని కలవలేదు.. ఆహ్వానించలేదు: మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ
పాకిస్థాన్ జర్నలిస్టు నుస్రత్ మిర్జాను తాను ఎన్నడూ భారత్‌కు ఆహ్వానించలేదని మాజీ రాష్ట్రపతి హమీద్ అన్సారీ అన్నారు. అలాగే, నుస్రత్ మిర్జాను ఎన్నడూ కలవలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో తాను ఐదు సార్లు భారత్‌కు వచ్చానని, అలాగే, కీలక సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కు అందించానని తాజాగా పాకిస్థాన్ జర్నలిస్టు నుస్రత్ మిర్జా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Mamid Ansari
Pak Journalist Row: పాకిస్థాన్ జర్నలిస్టు నుస్రత్ మిర్జాను తాను ఎన్నడూ భారత్‌కు ఆహ్వానించలేదని మాజీ రాష్ట్రపతి హమీద్ అన్సారీ అన్నారు. అలాగే, నుస్రత్ మిర్జాను ఎన్నడూ కలవలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో తాను ఐదు సార్లు భారత్‌కు వచ్చానని, అలాగే, కీలక సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కు అందించానని తాజాగా పాకిస్థాన్ జర్నలిస్టు నుస్రత్ మిర్జా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సింధ్ సీఎం సలహాదారుగాను నుస్రత్ మిర్జా పనిచేశారు.
Afghan girls: తాలిబన్ల పాలనలో అగమ్యగోచరంగా అఫ్గాన్ బాలికల పరిస్థితి
తనకు భారత్‌లో పర్యటించేందుకు పాక్ విదేశాంగ శాఖ నుంచి చాలా సార్లు అవకాశాలు వచ్చాయని తాజాగా చెప్పారు. భారత్‌లో 3 ప్రాంతాలకు వెళ్ళేందుకు మాత్రమే అనుమతులు వస్తాయని, తనకు మాత్రం 7 ప్రాంతాల్లో పర్యటించేలా అనుమతులు దక్కాయని అన్నారు. హమీద్ అన్సారీ భారత ఉప రాష్ట్రపతిగా ఉన్న సమయంలో తనను ఆహ్వానించారని ఆయన చెప్పారు. 2007-2017 మధ్య తాను ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల్లో పర్యటించానని, మొత్తం ఐదు సార్లు భారత్‌కు వెళ్ళానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే హమీద్ అన్సారీ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పారు. ఓ వర్గానికి చెందిన మీడియా, బీజేపీ వారు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సూచనలతోనే ఉప రాష్ట్రపతి విదేశీ ప్రతినిధులను ఆహ్వానిస్తారని ఆయన గుర్తుచేశారు.