హ్యాపీ బర్త్‌డే జగ్గూ భాయ్

హ్యాపీ బర్త్‌డే జగ్గూ భాయ్

Updated On : February 12, 2021 / 3:30 PM IST

Jagapathi Babu: జగపతి బాబు.. గత మూడు దశాబ్దాలకు పైగా తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత, జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి. రాజేంద్ర ప్రసాద్ గారి వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఫిబ్రవరి 12 జగ్గూ భాయ్ 59వ బర్త్‌డే జరుపుకుంటున్నారు.

Jagapathi Babu

‘నట భూషణ’ శోభన్ బాబు తర్వాత ఇద్దరు కథానాయికలతో నటించి ఫ్యామిలీ హీరోగా స్టార్ డమ్ దక్కించుకున్నారు. ‘గాయం’, ‘అంత:పురం’ ‘శుభలగ్నం’, ‘మావిచిగురు’, ‘మావిడాకులు’ ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశారాయన.

Jagapathi Babu

అప్పుడప్పుడు ఇంపార్టెంట్ రోల్స్ చేసినా.. హీరో నుండి విలన్‌గా మారి ‘లెజెండ్’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇక అప్పటినుండి వెనుదిరిగి చూసుకోలేదు.. ‘నాన్నకు ప్రేమతో’, ‘శ్రీమంతుడు’, ‘సైరా’ ‘మన్యంపులి’ ఇలా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్టార్ విలన్‌గా కంటిన్యూ అవుతున్నారు.

Jagapathi Babu

 

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ కూడా ఇంత బాగుంటుంది అని స్టైలిష్ విలనిజాన్ని వెండితెరకి పరిచయం చేశారు జగ్గూ భాయ్. ఫిబ్రవరి 12 ఆయన పుట్టినరోజు నాడే ‘FCUK- ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్’ మూవీ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు ప్రైమ్ స్టార్, ఫ్యామిలీ హీరో, స్టైలిష్ విలన్.. వీరమాచినేని జగపతి బాబు.

FCUK