Hero Nani : హీరో నాని పైన పడిన ట్రక్కు బొగ్గు.. తృటిలో తప్పిన ప్రమాదం..
తాజాగా గోదావరిఖని బొగ్గు గనుల్లో షూటింగ్ జరుగుతుండగా నానికి తృటిలో ప్రమాదం తప్పినట్టు తెలుస్తుంది. బొగ్గు ట్రక్కు కింద నాని ఉండగా ఆ బొగ్గు అంతా నానిపై..........

Nani Dasara movie
Hero Nani : న్యాచురల్ స్టార్ నాని ఇటీవల వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. ఇటీవలే అంటే సుందరానికి లాంటి క్లాసిక్ స్టోరీతో మెప్పించిన నాని త్వరలో దసరా లాంటి మాస్ సినిమాతో రాబోతున్నాడు. మొదటి సారి పూర్తి మాస్ క్యారెక్టర్ లో కనపడనున్నాడు నాని ఈ సినిమాలో. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ లో నాని లుక్ ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. గోదావరి ఖని బొగ్గు గనుల్లో ప్రస్తుతం ఈ సినిమా షూట్ జరుగుతుంది.
Tollywood Success : టాలీవుడ్ సక్సెస్ ని ఈ ఇద్దరు హీరోలు కంటిన్యూ చేస్తారా..?
తాజాగా గోదావరిఖని బొగ్గు గనుల్లో షూటింగ్ జరుగుతుండగా నానికి తృటిలో ప్రమాదం తప్పినట్టు తెలుస్తుంది. బొగ్గు ట్రక్కు కింద నాని ఉండగా ఆ బొగ్గు అంతా నానిపై పడిందట. వెంటనే చిత్ర యూనిట్ తేరుకొని నానిని బయటకి లాగారు. అయితే నానికి చిన్నగా గాయాలు తప్ప పెద్ద ప్రమాదం ఏం జరగలేదని, చిత్ర యూనిట్ వెంటనే స్పందించడంతో తృటిలో ప్రమాదం తప్పిందని సమాచారం. దీంతో ఆ రోజు దసరా సినిమా షూట్ చాలా సేపు ఆగిపోయినట్టు తెలుస్తుంది.