Honeycombs Tree : వాటే వండర్.. ఆ చెట్టు నిండా తేనెపట్లే.. మొత్తం 200లకు పైమాటే..

Hundreds Of Honeycombs In Single Tree : సాధారణంగా జనావాసాల్లో.. మనకు తెలిసి.. ఓ చెట్టుకు మహా అయితే రెండో, మూడో తేనెపట్లు కనిపిస్తుంటాయి. అది సర్వసాధారణం. అందులో పెత్త వింతేమీ లేదు. కానీ జనావాసాల్లో ఉండే ఓ చెట్టుకి పెద్ద సంఖ్యలో తేనెపట్లు ఉండటం ఎప్పుడైనా కళ్లారా చూశారా? కనీసం విన్నారా? లేదు కదూ.. ఆ చెట్టుకు మాత్రం వందల సంఖ్యలో...

Honeycombs Tree : వాటే వండర్.. ఆ చెట్టు నిండా తేనెపట్లే.. మొత్తం 200లకు పైమాటే..

Honey Tree

Updated On : April 3, 2021 / 7:00 AM IST

Hundreds Of Honeycombs In Single Tree : సాధారణంగా జనావాసాల్లో.. మనకు తెలిసి.. ఓ చెట్టుకు మహా అయితే రెండో, మూడో తేనెపట్లు కనిపిస్తుంటాయి. అది సర్వసాధారణం. అందులో పెత్త వింతేమీ లేదు. కానీ జనావాసాల్లో ఉండే ఓ చెట్టుకి పెద్ద సంఖ్యలో తేనెపట్లు ఉండటం ఎప్పుడైనా కళ్లారా చూశారా? కనీసం విన్నారా? లేదు కదూ.. ఆ చెట్టుకు మాత్రం వందల సంఖ్యలో తేనెపట్లు ఉన్నాయి. చెట్టు కొమ్మలన్నీ తేనెలొలుకుతున్నట్లు కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

జన సంచారం లేని అటవీ ప్రాంతాల్లో చెట్లకు తేనెపట్లు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. కానీ విశాఖపట్నంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. జిల్లాలోని ఆర్వీనగర్‌ సమీపంలోని బాడిదపాకలు అనే గ్రామంలో జనావాసాలను ఆనుకుని ఉన్న ఓ భారీ చెట్టు నిండుగా తేనెపట్లే ఉన్నాయి. ఎంతలా అంటే ప్రతి కొమ్మకూ పదుల సంఖ్యలో తేనెపట్లు ఉన్నాయి. ఇలా ఈ చెట్టుకు మొత్తంగా 200కు పైగా తేనెపట్లు ఉండటం విశేషం.

ఇప్పుడీ చెట్టు స్తానికంగా స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఆ చుట్టుపక్కలకు ఎవరైనా వస్తే.. కచ్చితంగా ఈ చెట్టు చూసేందుకు వస్తారు. చెట్టుని చూశాక వాటే వండర్ అనకుండా ఉండలేరు. కాలుష్యం నిండిపోయిన ఈ రోజుల్లో, చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిన ఈ పరిస్థితుల్లో.. అదీ జనాలు ఉంటున్న ప్రాంతాల్లో.. ఇలా.. ఓ చెట్టు నిండా తేనెపట్లు ఉండటం విశేషమే కదా.