Navagrhalu : నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ ఎలా చేయాలి…ఎన్ని సార్లు చేయాలో తెలుసా…

నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్ళే ముందు, సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి చంద్రుని వైపు నుంచి.. కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.

Navagrhalu : నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ ఎలా చేయాలి…ఎన్ని సార్లు చేయాలో తెలుసా…

Navagrhalu

Updated On : July 28, 2021 / 3:50 PM IST

Navagrhalu : హిందువుల అచార సాంప్రదాయాల్లో, జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనుషుల స్ధితిగతులు, భవిష్యత్తు వ్యవహరాలపై వీటి ప్రభావం గురించి చాలా మంది అమితమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. నవగ్రహాలు చాలా శ‌క్తివంత‌మైన‌వని నమ్ముతారు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందని విశ్వసిస్తారు. అయితే ప్రదక్షిణలు ఎలా చేయాలి ? ఎన్నిసార్లు చేయాలి ? అనే దానికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే…

గ్రహస్థితిలో మార్పులు వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గానీ, లాభాలు, సంతోషాలు కలిసిరావడం గానీ వస్తుంటాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు చేయటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఎప్పుడుపడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకూ తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి.

నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్ళే ముందు, సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి చంద్రుని వైపు నుంచి.. కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు అంటే బుధుడి వైపు నుంచి.. రాహువు, కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయటం మంచిది. మొత్తం 11 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేస్తున్నంత సేపూ నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలను స్తుతిస్తూ శ్లోకాలు చదివాలి.

అదేవిధంగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి, నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది. శివాలయంలో ఉండే నవగ్రహాలకు ప్రత్యేకమైన సన్నిధి వుంటుంది. మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ: అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి.