Hyderabad Shilpa Layout flyover : భాగ్యనగర సిగలో మరో సేతు హారం.. శిల్పా లేవుట్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
భాగ్యనగర సిగలో మరో సేతు హారం.. కొలువుదీరనుంది. గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీదుగా నిర్మించిన శిల్పా లేవుట్‌పై వంతెనను ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఎస్‌ఆర్‌డీపీలో వడివడిగా సిద్ధమైన 17వ వంతెన ఇది. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే.. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్య మరింత తగ్గుతుంది. గచ్చిబౌలి ఔటర్ ఎగ్జిట్ నుంచి శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ నుంచి మైండ్ స్పేస్, దుర్గం చెరువు వంతెనల మీదుగా ప్రయాణిస్తే జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు కేవలం పది నిమిషాల్లో చేరుకోవచ్చు.

Minister KTR to inaugurate Shilpa Layout flyover today (1)
Hyderabad Shilpa Layout flyover : భాగ్యనగర సిగలో మరో సేతు హారం.. కొలువుదీరనుంది. గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీదుగా నిర్మించిన శిల్పా లేవుట్‌పై వంతెనను ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఎస్‌ఆర్‌డీపీలో వడివడిగా సిద్ధమైన 17వ వంతెన ఇది. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే.. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్య మరింత తగ్గుతుంది. గచ్చిబౌలి ఔటర్ ఎగ్జిట్ నుంచి శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ నుంచి మైండ్ స్పేస్, దుర్గం చెరువు వంతెనల మీదుగా ప్రయాణిస్తే జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు కేవలం పది నిమిషాల్లో చేరుకోవచ్చు.
హైదరాబాద్ మహానగరం రోజురోజుకు విస్తరిస్తుండటంతో.. అందుకు తగ్గట్టుగా వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. 2040 నాటికి ప్రతి గంటకు 5వేల 2వందల వాహనాలు వస్తాయని అధికారుల అంచనా. దీనికితోడు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు.. ఔటర్ రింగు రోడ్డు ద్వారా గచ్చిబౌలి వరకు .. ఎలాంటి సమస్యలు లేకుండా నేరుగా చేరుకున్నప్పటికీ .. అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతోఈ సమస్యను అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ విశేషంగా కృషి చేస్తోంది. రవాణా సౌకర్యం, వాహన కాలుష్యాన్ని తగ్గించడం, సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మెరుగుపరిచి .. వాహనదారులు చేరుకోవాల్సిన గమ్యస్థానానికి సకాలంలో చేరడానికి .. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ SRDP ప్రోగ్రామ్ ద్వారా చేపట్టిన పనులను ఒక్కొక్కటిగా అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఇప్పుడు శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుండటంతో .. ఇక ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్య తప్పనుంది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి మీదుగా పఠాన్ చెరువు, కోకాపేట్, నార్సింగ్‌తో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లేందుకు ఒక మార్గం, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మాదాపూర్ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు గచ్చిబౌలి ఓఆర్‌ఆర్ నుంచి గ్రేడ్ సపరేట్ మరొక ఫ్లై ఓవర్ బ్రిడ్జిని చేపట్టారు. 4 లైన్లలో శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ నిర్మించారు. 823 మీటర్ల పొడవు, 16.60 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ వంతెన.. నగరంలోని పొడవైన ఫ్లైఓవర్లలో ఒకటిగా నిలవనుంది. ఇప్పటివరకూ 11.6 కి.మీ. పొడవుతో పీవీ ఎక్స్‌ప్రెస్ వే నగరంలో పొడవైన వంతెనగా ఉంది.
అయితే.. శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ వెడల్పు పరంగా, నిర్మాణ పరంగా పెద్దది. గచ్చిబౌలిలో ఇప్పటికే ఉన్న బ్రిడ్జిపై నుంచి ఈ కొత్త వంతెన వెళ్తుంది. ఈ వంతెన కోసం 14.5 మీటర్ల వెడల్పు, 23 మీటర్ల పొడవుతో .. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే మొదటిసారి స్టీల్ పోర్టల్ ఫ్రేమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లైఓవర్ నుంచి గచ్చిబౌలి వంతెన కంటే ముందే వాహనాలు కిందకు దిగేందుకు వీలుగా ఓ ర్యాంపు ఉంటుంది. మరొకటి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డును కలుపుతుంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుండటంతో.. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.