Kejriwal: నేను నేరస్థుడిని కాదు.. ఓ ముఖ్యమంత్రిని: కేజ్రీవాల్
''నేను నేరస్థుడిని కాదు.. నేను ఓ ముఖ్యమంత్రిని. దేశంలోని స్వేచ్ఛా పౌరుడిని. సింగపూర్ వెళ్ళకుండా నన్ను ఆపడానికి చట్టపరంగా ఏ ఆధారాలూ లేవు. కాబట్టి, రాజకీయ కారణాల వల్లే నన్ను అడ్డుకుంటున్నారని అర్థమవుతోంది'' అని కేజ్రీవాల్ అన్నారు.

Aam Aadmi Party
Kejriwal: సింగపూర్ పర్యటనకు వెళ్ళేందుకు కేంద్ర ప్రభుత్వం తనకు అనుమతి ఇవ్వకపోవడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి మండిపడ్డారు. ఆ దేశంలో ఆగస్టు మొదటి వారంలో జరిగే ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’కు రావాలని కేజ్రీవాల్‌కు సింగపూర్ హై కమిషనర్ సైమన్ వాంగ్ గత నెల ఆహ్వానం పంపింది. ఈ పర్యటన కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు కేజ్రీవాల్ లేఖ రాసినప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదు.
దీనిపై కేజ్రీవాల్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… ”నేను నేరస్థుడిని కాదు.. నేను ఓ ముఖ్యమంత్రిని. దేశంలోని స్వేచ్ఛా పౌరుడిని. సింగపూర్ వెళ్ళకుండా నన్ను ఆపడానికి చట్టపరంగా ఏ ఆధారాలూ లేవు. కాబట్టి, రాజకీయ కారణాల వల్లే నన్ను అడ్డుకుంటున్నారని అర్థమవుతోంది” అని కేజ్రీవాల్ అన్నారు. తనను సింగపూర్ ప్రభుత్వమే ఆ దేశానికి ఆహ్వానించిందని, తాను ఢిల్లీ మోడల్‌ను ప్రపంచ నేతల ముందు ఉంచుతానని చెప్పారు. ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’కు తొలిరోజే కేజ్రీవాల్ హాజరుకావాల్సి ఉంది.
కాగా, జీఎస్టీపై కూడా కేజ్రీవాల్ మండిపడ్డారు. ధరల పెరుగుదలతో దేశం ప్రజలు ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటుంటే కేంద్ర ప్రభుత్వం ఆహార పదార్థాలపై జీఎస్టీ విధిస్తోందని అన్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
England vs India: రిషబ్ పంత్ అద్భుత ఆటతీరుపై సచిన్, గంగూలీ, సెహ్వాగ్ ప్రశంసల జల్లు