ఇంట్రెస్టింగ్‌గా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ టీజర్..

ఇంట్రెస్టింగ్‌గా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ టీజర్..

Updated On : January 29, 2021 / 12:34 PM IST

IVNR: ‘చి.ల.సౌ’, ‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలతో ఆకట్టుకున్న యువ నటుడు సుశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్’ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రానికి ఎస్. దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు.

టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. సుశాంత్ లుక్ డిఫరెంట్‌గా ఆకట్టుకుంటోంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. లవ్, బైక్, సెంటిమెంట్ వంటివి టీజర్‌లో చూపించారు.

IVNR
ఒకప్పటి కథానాయకుడు వెంకట్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. వెన్నెల కిశోర్, ప్రియదర్శి, ఐశ్వర్య తదితరులు నటిస్తున్న ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.