Ulnar nerve: మోచేతికి దెబ్బ తగిలితే జివ్వు మంటుంది.. ఎందుకో తెలుసా?
మానవ శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా నొప్పి చాలా సాధారణమైన విషయమని అందరికీ తెలిసిందే. అయితే మోచేతి మీద దెబ్బ తగిలితే అదేదో కరెంట్ షాక్ కొట్టినట్లుగా..

Ulnar Nerve
Ulnar nerve: మానవ శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా నొప్పి చాలా సాధారణమైన విషయమని అందరికీ తెలిసిందే. అయితే మోచేతి మీద దెబ్బ తగిలితే అదేదో కరెంట్ షాక్ కొట్టినట్లుగా అరికాలు నుండి మెదడు వరకు ఒక్కసారిగా జివ్వు మంటుంది. పైగా దెబ్బ కొంచెం గట్టిగా తగిలితే కాసేపు స్పర్శ కూడా తెలియదు. మరి దీనికి కారణం ఏంటో తెలుసా?.. మన బాడీలో ఎన్నో నరాలు ఉంటాయి. అవన్నీ శరీరంలోని వివిధ భాగాలను అనుసంధానిస్తూ చివరికి మెదడుకి చేరి మళ్ళీ అక్కడ నుండి శరీరంలోని అన్ని భాగాలకు అనుసంధానమవుతుంది.
ఈ నరాలన్నిటినీ కండరాలు, ఎముకలు కవర్ చేస్తూ ఉంటాయి. అందుకు మనకి ఎక్కడైనా దెబ్బ తగలగానే కండరాలకు, ఎముకలకు దెబ్బ తగలడంతో నొప్పిగా ఉంటుంది. అయితే, ఒక్క మోచేతి మీద దెబ్బ తగిలితే మాత్రం జివ్వు మంటుంది. దీనికి కారణం మోచేతి మీద నరానికి ఎలాంటి ఎముక కానీ కండరాలు కానీ రక్షణ ఉండవు. కేవలం నరం మీద చర్మం మాత్రమే ఉంటుంది. అందుకే దెబ్బ తగలగానే అది డైరెక్ట్ గా నరానికి తగులుతుంది.
దీంతో మోచేతి మీద దెబ్బ తగలగానే ఒక్కసారిగా జివ్వు మంటుంది. ఈ మోచేతి మీద నరాన్ని వైద్య భాషలో అల్నార్ నరం అంటారు. ఈ అల్నార్ నరం చేతి చిటికెన వేలు, ఉంగరపు వేలు నుండి వెన్నెముక, వీపు, మీద మీదగా మెదడుకు అనుసంధానమై ఉంటుంది. ఈ అల్నార్ నరం వేలి చివర నుండి ఎన్ని చోట్లా ఎంతో కొంత రక్షణ ఉంటుంది కానీ.. ఒక్క మోచేతి దగ్గర మాత్రం చర్మం మాత్రమే రక్షణ ఉంటుంది. పైగా ఎముక పై భాగంలో ఇక్కడ నరం ఉంటుంది. అందుకే మోచేతి మీద ఏదైనా వస్తువు తగిలినప్పుడు నరం, ఎముక మధ్య ఒత్తిడి ఏర్పడి అలా షాక్ కొట్టినట్లుగా ఉంటుంది.