Gold Ornaments: ఎలుకల నుంచి రూ.5లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఎలుకల నుంచి రూ.5లక్షలు స్వాధీనం చేసుకున్నారు. చెత్తకుండీలో నుంచి బంగారు నగలు ఉన్న సంచిని ఎలుకలు బయటకు తీయడాన్ని చూసిన పోలీసులు ఎట్టకేలకు స్వాధీనపరచుకున్నారు.

Gold Ornaments: ఎలుకల నుంచి రూ.5లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

Gold Ornaments

Updated On : June 16, 2022 / 11:53 PM IST

Gold Ornaments: సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఎలుకల నుంచి రూ.5లక్షలు స్వాధీనం చేసుకున్నారు. చెత్తకుండీలో నుంచి బంగారు నగలు ఉన్న సంచిని ఎలుకలు బయటకు తీయడాన్ని చూసిన పోలీసులు ఎట్టకేలకు స్వాధీనపరచుకున్నారు.

కూతురి పెళ్లి కోసం తీసుకున్న అప్పు నిమిత్తం బ్యాంకులో జ్యూవెల‌రీని డిపాజిట్ చేసేందుకు మ‌హిళ వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలోనే వెళ్తుండగా తన చేతిలో ఉన్న వ‌డ‌పావ్ క‌వ‌ర్‌ను ఆమె తీసుకుని.. పొర‌పాటున బంగారు ఆభ‌రణాలు ఉన్న క‌వ‌ర్‌ను ఇచ్చింది. తీరా బ్యాంక్‌కు వెళ్లి చూసిన త‌ర్వాత జ్యూవెల‌రీ ఉన్న బ్యాగ్‌ను ఇచ్చిన‌ట్టు గుర్తించి వెన‌క్కి రాగా చిన్నారి క‌నిపించ‌లేదు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు చిన్నారిని వెతుక్కుంటూ రాగా, చిన్నారి ఆమె తల్లి వడపావ్ పొడిగా ఉందని చెత్తకుండీలో విసిరేశామని చెప్పారు. సూరజ్ రౌత్ అనే పోలీసు అధికారి సీసీటీవీ ఫుటేజి పరిశీలించి చెత్తకుండీలోని ప్యాకెట్ ను ఎలుకలు బయటకు తీయడాన్ని గమనించారు.

Read Also: చీమలు చెప్పిన బంగారు గని రహస్యం: బీహార్‌లో బంగారం ఎలా బయటపడింది

ఎలుకలు నగల సంచిని మోసుకెళ్లిన వైపు గుర్తించి వాటిని వెదుక్కుంటూ వెళ్లారు. అలా ఆ సంచిని కనుగొని బంగారాన్ని బాధిత కుటుంబానికి అందించారు.