Pakistan girl: మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాకిస్థాన్ అమ్మాయి

సోషల్ మీడియా ప్రభావంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన పాకిస్థాన్ అమ్మాయి అయేషా (18)కు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. తాజాగా ఆమె ‘బటియన్ బుజాయ్ రఖ్దీ’ అనే పాటకు డ్యాన్స్ చేసింది. లతా మంగేష్కర్ పాడిన సూపర్ హిట్ పాట ‘మేరా దిల్ యే పుకారే ఆజా’ పాటకు ఆమె కొన్ని రోజుల క్రితం డ్యాన్స్ చేయడంతో పాప్యులర్ అయిపోయింది. ఆ సమయంలో ధరించిన దుస్తులనే తాజాగా మళ్ళీ ధరించి ‘బటియన్ బుజాయ్ రఖ్దీ’ అనే పాటకు ఆమె డ్యాన్స్ చేసింది.

Pakistan girl: మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాకిస్థాన్ అమ్మాయి

India vs New Zealand

Updated On : November 30, 2022 / 4:02 PM IST

Pakistan girl: సోషల్ మీడియా ప్రభావంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన పాకిస్థాన్ అమ్మాయి అయేషా (18)కు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. తాజాగా ఆమె ‘బటియన్ బుజాయ్ రఖ్దీ’ అనే పాటకు డ్యాన్స్ చేసింది. లతా మంగేష్కర్ పాడిన సూపర్ హిట్ పాట ‘మేరా దిల్ యే పుకారే ఆజా’ పాటకు ఆమె కొన్ని రోజుల క్రితం డ్యాన్స్ చేయడంతో పాప్యులర్ అయిపోయింది. ఆ సమయంలో ధరించిన దుస్తులనే తాజాగా మళ్ళీ ధరించి ‘బటియన్ బుజాయ్ రఖ్దీ’ అనే పాటకు ఆమె డ్యాన్స్ చేసింది.

పెళ్లి వేడుకలో ఆమె చేసిన డ్యాన్స్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పాకిస్థాన్ తో పాటు భారత్ లో ఆమె వీడియోలు వైరల్ అవుతున్నాయి. ‘‘నన్ను నేను ప్రేమిస్తాను… చెడుగా కామెంట్లు చేయకండి’’ అంటూ అయేషా తాజాగా ఈ వీడియోను పోస్ట్ చేసింది. పాకిస్థాన్ లో అమ్మాయిల దుస్తులు, కట్టుబాట్ల విషయంలో ఉండే ఛాందసవాదానికి వ్యతిరేకంగా ఆమె ధైర్యంగా డ్యాన్సులు చేస్తుండడం గమనార్హం.

లాహోర్ కు చెందిన ఈ అమ్మాయికి కొన్ని రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్ లో లక్షలాది మంది ఫాలోవర్లు పెరిగారు. ఆమె తొలుత సల్వార్ సూట్లో చేసిన డ్యాన్సు వైరల్ కావడంతో ఈ సారి కూడా అదే సల్వార్ సూట్లో మరో పాటకు డ్యాన్స్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Saeed Asif (@asif_daddy)

 

View this post on Instagram

 

A post shared by AYESHA (@oyee_ayesha)

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..