Twitter Koo App : ట్విట్టర్‌కు పోటీగా Koo యాప్ లాంచ్.. బ్రెజిల్‌లో మిలియన్లకుపైగా డౌన్‌లోడ్లతో అగ్రస్థానం!

Twitter Koo App : భారత మల్టీ లాంగ్వేజ్ మైక్రోబ్లాగింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ Koo (కూ) ఇటీవల బ్రెజిల్‌లో లాంచ్ అయింది. అదనంగా, ప్లాట్‌ఫారమ్ పోర్చుగీస్‌కు లాంగ్వేజ్ సపోర్టును కూడా యాడ్ చేసింది. 11 లోకల్ భాషలలో అందుబాటులోకి వచ్చింది.

Twitter Koo App : ట్విట్టర్‌కు పోటీగా Koo యాప్ లాంచ్.. బ్రెజిల్‌లో మిలియన్లకుపైగా డౌన్‌లోడ్లతో అగ్రస్థానం!

Indian Twitter alternative Koo App launched in Brazil, garners 1 million downloads already

Updated On : November 22, 2022 / 2:33 PM IST

Twitter Koo App : భారత మల్టీ లాంగ్వేజ్ మైక్రోబ్లాగింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ Koo (కూ) ఇటీవల బ్రెజిల్‌లో లాంచ్ అయింది. అదనంగా, ప్లాట్‌ఫారమ్ పోర్చుగీస్‌కు లాంగ్వేజ్ సపోర్టును కూడా యాడ్ చేసింది. 11 లోకల్ భాషలలో అందుబాటులోకి వచ్చింది. బ్రెజిల్‌లో లాంచ్ అయిన 48 గంటల్లో, యాప్ 1 మిలియన్ యూజర్ డౌన్‌లోడ్‌లు, 2 మిలియన్ కూ యాప్, 10 మిలియన్ లైక్‌లకు చేరింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ (Play Store), యాపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ #1 అగ్రస్థానంలో ఉంది.

గత 48 గంటల్లో బ్రెజిల్ నుంచి మిలియన్ కన్నా ఎక్కువ మంది యూజర్లు (Koo)లో చేరారు. బ్రెజిల్ సోషల్ మీడియాలో లోకల్ భాష అయిన పోర్చుగీస్‌లోనూ కూ యాప్ పెద్దదిగా చెప్పవచ్చు. అంతేకాదు.. కూ యాప్ బ్రెజిల్‌లో కల్ట్ బ్రాండ్‌గా మారింది. మిలియన్ల మంది యూజర్లతో ఫాలోయింగ్‌ కలిగి ఉంది. టెక్ ప్రొడక్టుల ప్రపంచంలో ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ ఉద్యమాన్ని ప్రారంభించినట్టు Koo సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా అధికారిక ప్రకటనలో తెలిపారు.

Indian Twitter alternative Koo App launched in Brazil, garners 1 million downloads already

Indian Twitter alternative Koo App launched in Brazil, garners 1 million downloads already

బ్రెజిల్‌లో ప్రతి కొత్త భాషను.. భాష-అవరోధాలు లేకుండా ప్రపంచంతో ఏకం చేయాలనే తమ మిషన్‌కు మరింత దగ్గరవుతుందని తెలిపారు. ఈ మిషన్ ప్రారంభించిన తర్వాత.. రోసానా హెర్మాన్, బాబు సంతాన, క్లాడియా లీట్, న్యూస్ అవుట్‌లెట్ చోక్వీతో సహా ప్రసిద్ధ బ్రెజిలియన్ సెలబ్రిటీలు కూడా కూ యాప్‌లో చేరారు. సెలబ్రిటీ ఫెలిప్ నెటో ప్లాట్‌ఫారమ్‌లో చేరిన తర్వాత కేవలం రెండు రోజుల్లోనే 450K ఫాలోవర్లను అధిగమించారు.

అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న యూజర్లుగా మారారు. భారత్‌లో బెంగుళూరు కేంద్రంగా ఏర్పడిన Koo ప్రారంభంలో కన్నడ భాష సపోర్టుతో 2020లో లాంచ్ అయింది. ఆ తరువాత Koo యాప్ హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, అస్సామీ, మరాఠీ, బంగ్లా, గుజరాతీ, పంజాబీ, హౌసాలకు సపోర్టు అందిస్తుంది.

Indian Twitter alternative Koo App launched in Brazil, garners 1 million downloads already

Indian Twitter alternative Koo App launched in Brazil, garners 1 million downloads

బహుభాషా మైక్రోబ్లాగింగ్‌గా బలమైన పునాదిని ఏర్పరుచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేశాలకు చేరుకోవాలని Koo మరింత లక్ష్యంగా పెట్టుకుంది. యాప్ డేటా ప్రకారం.. త్వరలో కూ అరబిక్, స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, కొరియన్, జపనీస్, ఇతర భాషలతో సహా మరిన్ని విదేశీ స్థానిక భాషలకు కూడా సపోర్టు అందిస్తుంది. ప్రస్తుతం ట్విట్టర్‌లో ఏర్పడిన గందరగోళాల మధ్య, Koo యాప్ క్రమంగా వృద్ధిని సాధించింది. తద్వారా రెండో అతిపెద్ద మల్టీ-లాంగ్వేజ్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌గా కూ యాప్ మారింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : #RIPTwitter – Koo : ట్విట్టర్ పనైపోయింది.. మా కంపెనీలో చేరండి.. మస్క్ తొలగించిన ట్విట్టర్ ఉద్యోగులకు Koo ఆఫర్..!