Vice Presidential election: నామినేషన్ వేసిన జగదీప్ ధన్‌కర్
తనలాంటి వ్యక్తికి ఇటువంటి గొప్ప అవకాశం వస్తుందని తాను ఎన్నడూ ఊహించలేదని జగదీప్ ధన్ కర్ చెప్పారు. దేశ ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి తాను ఎప్పటికీ కృషి చేస్తూనే ఉంటానని ఆయన తెలిపారు.

Nomination
Vice Presidential election: ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆయనతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు ఇతర నేతలు కూడా ఉన్నారు. నామినేషన్ వేసిన జగదీప్ ధన్‌కర్‌కు ఆయా నేతలు ఆల్ ది బెస్ట్ చెప్పారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు చెబుతున్నానని ఈ సందర్భంగా జగదీప్ మీడియాతో అన్నారు.
England vs India: రిషబ్ పంత్ అద్భుత ఆటతీరుపై సచిన్, గంగూలీ, సెహ్వాగ్ ప్రశంసల జల్లు
తనలాంటి వ్యక్తికి ఇటువంటి గొప్ప అవకాశం వస్తుందని తాను ఎన్నడూ ఊహించలేదని జగదీప్ ధన్ కర్ చెప్పారు. దేశ ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి తాను ఎప్పటికీ కృషి చేస్తూనే ఉంటానని ఆయన తెలిపారు. కాగా, ఉప రాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరగనుంది. నామినేషన్లకు రేపే చివరి తేదీ. ఈ ఎన్నికలో విపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పోటీకి దిగుతున్నారు.