గిటార్ వాయిస్తూ..పాట పాడి వలస కూలీలకు సెండాఫ్ ఇచ్చిన పోలీస్

  • Published By: nagamani ,Published On : May 16, 2020 / 05:28 AM IST
గిటార్ వాయిస్తూ..పాట పాడి వలస కూలీలకు సెండాఫ్ ఇచ్చిన పోలీస్

Updated On : October 31, 2020 / 12:12 PM IST

లాక్ డౌన్ దెబ్బకు వలస కూలీలు తమ తమ సొంత గ్రామాలకు కాలి నడకలే బయలుదేరారు. వందల కిలోమీటర్ల దూరాలు ఉన్నా ఏమాత్రంలెక్క చేయటంలేదు. కాళ్లుబొబ్బలెక్కుతున్నా..వారం కాకపోతే నెలకు తమ ఊరు చేరుకోలేమా అనే స్థైర్యంతో మండు వేసవిలో ఎర్రటి ఎండను కూడా లెక్కచేయకుండా కాలినడకనే పయనం సాగిస్తున్న దారిలో ఎన్నో దీనగాథలు. మరెన్నో విషాదగాథలు.

అయినా వారి పయనం ఆపటకుండా సాగిస్తునే ఉన్నారు. అలా వారి వారి ప్రాంతాలకు కాలినడకన వెళ్తున్నవారికి పోలీసులు ఆహారం నీళ్లను అందిస్తున్నారు. రైళ్ల మార్గం ద్వారావెళ్లే వారికి కూడా పోలీసులు తమదైన శైలిలో సెండాఫ్ ఇస్తున్నారు. అలా ఓ పోలీసులు రైళ్లలో వెళ్లే వలస కూలీలకు గిటార్ వాయిస్తు పాట పాడుతూ సెండాఫ్ ఇచ్చారు ఓ పోలీసు అధికారి.

వలస కూలీలను తీసుకుని జమ్ము కశ్మీర్ నుంచి శ్రామిక రైలు బయలుదేరింది. వారికి సెండాఫ్ ఇచ్చేందుకు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మెడ్లీ రాక్ స్టార్ లా మారిపోయారు. ఓ గిటారు వాయిస్తు ‘గులాబీ ఆంఖేన్ ట్రాక్‌తో ప్రారంభించి, ఆపై ఖయామత్ సే ఖయామత్ తక్ నుండి పాపా కెహతే హై’ను పాడారు. జమ్ము పోలీస్ ఇచ్చిన ఫర్వార్మెన్స్ కు వలస కూలీలతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు.

ముఖేష్ సింగ్ అనే ఓ పోలీసు అధికారి ఈ వీడియోను తన ట్విట్లర్ లో పోస్ట్ చేయటంతో పాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ సొంత ఊర్లకు వెళ్లుతున్నవారిని అలరించేందుకు మోడ్లీ రాక్ స్టార్ లా మారటం నెటిజన్లను ఫిదా చేసింది. దీంతో ఈ వీడియోను వైరల్ చేశారు. 

Read Here>>  పెళ్లికొచ్చినా..పేరంటానికి వచ్చినా..క్వారంటైన్ కు తరలిస్తాం