రాష్ట్రంలో శాసించాల్సిన కాపులు యాచిస్తున్నారు: పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో శాసించాల్సిన కాపులు యాచిస్తున్నారు: పవన్ కళ్యాణ్

Updated On : January 29, 2021 / 9:39 PM IST

కాపు సంక్షేమంపైన ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో హోం శాఖామంత్రిగా పనిచేసిన హరిరామ జోగయ్యతో కాపు ప్రతినిధులతో భేటీ అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మీడియాతో మాట్లాడారు. ఈ సంధర్భంగా 1895నుంచి కులాలవారీగా లెక్కింపు ప్రారంభించినప్పుడు.. కాపులను వెనుకబడిన కులాలుగా పరిగణించడం జరిగిందని, కాపుల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ.. ఇప్పుడు కూడా.. కాపులకు సరైన న్యాయం జరగలేదని అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్.

బ్రిటీష్ కాలంలోనూ.. ఎప్పుడూ కూడా సంఖ్యా బలాన్ని బట్టి, అధికారాన్ని శాసించే స్థాయిలో ఉండాల్సిన కాపులు.. యాచించే స్థాయికి చేరుకున్నారని, శాసించేస్థాయిలో ఉన్న కాపులను విభజించి పాలిస్తూ.. యాచించే పరిస్థితికి తెచ్చారని అన్నారు పవన్ కళ్యాణ్. కేవలం అధికారం కాపు కులాలు అత్యథిక సంఖ్యాబలం ఉండి కూడా.. కాపులను విడగొట్టి పాలించడం వల్ల అధికారం దక్కలేదని అన్నారు. యాచించే పరిస్థితి మారాలని అన్నారు.

అలాగే, కాపు నేస్తం.. కాపు మహిళా నేస్తం.. అంటూ పథకాలు 40లక్షల మందికి రావలసి ఉంటే, రెండున్నర లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని అన్నారు. తుని ఘటనలో కాపులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తేయ్యాలని పవన్ కళ్యాణ్ కోరారు. కాపుల్లో కొంతమందికి బీసీ స్టేటస్ ఇచ్చారు. కొందమందికి ఇవ్వలేదు అని చెప్పుకొచ్చారు. కాపులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్లాలని రాష్ట్రంలో అటువంటి రాజకీయ మార్పులు జరగాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.