Jr. NTR : అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ విన్నపం..
ప్రస్తుత పరిస్థితుల్లో అభిమానులెవరూ పబ్లిక్‌గా మీట్ అవడం కానీ, వేడుకలు నిర్వహించడం కానీ చెయ్యొద్దని ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఓ లెటర్ రిలీజ్ చేశారు..

Jr Ntr
Jr. NTR: ప్రస్తుత పరిస్థితుల్లో అభిమానులెవరూ పబ్లిక్‌గా మీట్ అవడం కానీ, వేడుకలు నిర్వహించడం కానీ చెయ్యొద్దని ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఓ లెటర్ రిలీజ్ చేశారు. మే 20వ తేది యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు.. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృత కొనసాగుతోంది.. ఈ పరిస్థితుల్లో బర్త్‌డే సెలబ్రేట్ చెయ్యొద్దని తెలిపారు తారక్..
‘‘నా అభిమానులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.. గత కొద్ది రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను.
మీ ఆశీస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను?
ప్రస్తుతం నేను బాగున్నాను. త్వరలో పూర్తిగా కోలుకొని కోవిడ్‌ను జయిస్తాను అని ఆశిస్తున్నాను.
ప్రతి ఏటా మీరు నా పుట్టిన రోజు చూపే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను.
కానీ ఈ సంవత్సరం మీరు ఇంటి పట్టునే ఉండి కర్ఫ్యూ, లేదా లాక్‌డౌన్ నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను.
ఇదే మీరు నాకు అందించే అతి పెద్ద కానుక.
ఇది వేడుకలు చేసుకొనే సమయం కాదు. మన దేశం కరోనాతో యుద్ధం చేస్తుంది.
కనిపించని శత్రువుతో అలుపెరగని పోరాటం చేస్తున్న మన డాక్టర్లు, నర్సులు మరియు ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు మన సంఘీభావం తెలపాలి.
ఎందరో తమ ప్రాణాలను, జీవనోపాధిని కోల్పోయారు. ఆ కుటుంబాలకు కుదిరితే అండగా నిలబడాలి.
మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, చేతనైన ఉపకారం చేయండి.
త్వరలో మనదేశం కరోనాను జయిస్తుంది అని నమ్ముతున్నాను. ఆ రోజున అందరం కలిసి వేడుక చేసుకుందాం. అప్పటి వరకు మాస్క్ ధరించండి, జాగ్రత్తగా ఉండండి…
నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ..’’
మీ
నందమూరి తారక రామారావు..
A humble appeal ?? pic.twitter.com/vzEtODgtEf
— Jr NTR (@tarak9999) May 19, 2021