Munugodu By Poll : మునుగోడులో టీఆర్ఎస్ రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీయే గెలుస్తుంది : కేఏ పాల్

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీయే గెలుస్తుందని ఎన్నికల తరువాత టీఆర్ఎస్ నుంచి సగం మంది నేతలు బీజేపీలో చేరతారు అంటూ వ్యాఖ్యానించారు కేఏ పాల్.

Munugodu By Poll : మునుగోడులో టీఆర్ఎస్ రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీయే గెలుస్తుంది : కేఏ పాల్

KA Paul comments On Munugodu By Poll

Updated On : August 10, 2022 / 4:11 PM IST

Munugodu By Poll : మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచే పార్టీ ఏంటో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తనదైన శైలిలో జోస్యం చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా గెలిచేది మాత్రం బీజేపీయే నంటూ చెప్పుకొచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితంలో గెలుపు సాధించేది బీజేపీ పార్టీయేనని..ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీ నుంచి సగం మంది బీజేపీలో జాయిన్ అవుతారు అని తెలిపారు కేఏపాల్.

ఆగస్టు 19,20 తేదీల్లో తాను మునుగోడులో పర్యటిస్తానని తెలిపిన పాల్..ఉప ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. కేసీఆర్ ను కలవాలని యత్నించినా కొంతమంది టీఆర్ఎస్ నేతలు కలవనివ్వలేదని అన్నారు. ఈక్రమంలో మంత్రి కేటీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్..కేటీఆర్ రాజకీయంగా ఇంకా అవగాహన పెంచుకోవాలని రాజకీయంగా కేటీఆర్ ఇంకా పరిపక్వత చెందలేదు అని అన్నారు. కేసీఆర్ కు నాకు గొడవ పెట్టింది దిలీప్ కుమార్ అంటూ ఆరోపించారు ఈ సందర్భంగా పాల్. కేసీఆర్ ను కలవటానికి అపాయింట్ మెంట్ కోరినా ఇవ్వలేదంటూ ఆరోపించారు.