Kaikala Satyanarayana : నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత..
తెలుగుతెరపై నందమూరి తారక రామారావుకి పోటీగా పౌరాణికి పాత్రలు పోషిస్తూ సినీ పరిశ్రమలో ఎంతో పేరుని సంపాదించుకున్న నటుడు 'కైకాల సత్యనారాయణ'. అయితే గత కొంతకాలంగా కైకాల తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. కాగా ఈ ఉదయం అయన ఆరోగ్య పరిస్థితి విషమం కావడంతో..

Kaikala Satyanarayana passed away
Kaikala Satyanarayana : తెలుగుతెరపై నందమూరి తారక రామారావుకి పోటీగా పౌరాణికి పాత్రలు పోషిస్తూ సినీ పరిశ్రమలో ఎంతో పేరుని సంపాదించుకున్న నటుడు ‘కైకాల సత్యనారాయణ’. సపోర్టింగ్ యాక్టర్‌గా, ప్రతినాయకుడిగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కలిపి దాదాపు 770 సినిమాలకు పైగా చేసిన కైకాల.. నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించాడు. అంతేకాదు రాజకీయవేత్తగా కూడా అయన సేవలు అందించాడు.
Kaikala Satyanarayana : నాకు అండగా ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి
అయితే గత కొంతకాలంగా కైకాల తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. పూర్తిగా ట్రీట్‌మెంట్ బెడ్‌కే పరిమితం కావడంతో, అయన ఇంటి వద్దే చికిత్స అందిస్తూ వస్తున్నారు వైద్యులు. ఇటీవల కైకాల బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, కైకాల ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా కేక్ ని కూడా కట్ చేయించాడు.
కాగా ఈ ఉదయం అయన ఆరోగ్య పరిస్థితి విషమం కావడంతో, 87 ఏళ్ళ కైకాల సత్యనారాయణ తుది శ్వాస విడిచినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన హెల్త్ బులిటెన్ విడుదల కావాల్సి ఉంది. కైకాల మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.