ఇన్‌స్టాగ్రామ్‌ వరస్ట్.. ఫోటోలు షేర్ చేసుకోడానికి తప్ప దేనికి పనికిరాదు.. కంగనా సీరియస్ పోస్ట్..

పలు అంశాలపై పోస్టులు పెట్టే కంగనా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ పై సీరియస్ అవుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. తన స్టోరీలో..........

ఇన్‌స్టాగ్రామ్‌ వరస్ట్.. ఫోటోలు షేర్ చేసుకోడానికి తప్ప దేనికి పనికిరాదు.. కంగనా సీరియస్ పోస్ట్..

Kangana Ranaut comments on Instagram

Updated On : November 12, 2022 / 7:02 AM IST

Kangana Ranaut :  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇండస్ట్రీలో, బయట జరిగే అన్యాయాల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, వాటిపై స్పందిస్తూ బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. పలు అంశాలపై పోస్టులు పెట్టే కంగనా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ పై సీరియస్ అవుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది.

Parvati Nair : లైంగిక వేధింపుల కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తుంది.. మలయాళ హీరోయిన్ పై సంచలన వ్యాఖ్యలు..

తన స్టోరీలో.. ”ఇన్‌స్టాగ్రామ్‌ మూగబోయిన గది లాంటిది. ఇక్కడ ఏమి ఉంచలేము. ఇది ఫోటోలు షేర్ చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. ఇందులో మనం ఏమి రాశామో అవి రేపటికి ఉండవు. కొంతమంది సరదాగా రాసేవాళ్ళకి దీనిగురించి అవసర్లేదు. కానీ మా ఆలోచనలని ఇతరులతో పంచుకోవాలంటే అవి మరుసటి రోజుకి కనుమరుగైపోతాయి. ఇక్కడ మన ఆలోచనలని స్టోర్ చేసుకోలేము. ఇవి మినీ బ్లాగ్స్ లాగా ఉంటే బాగుంటుంది” అని పోస్ట్ చేసింది కంగనా.