Kangana Ranaut: కంగనాకు మాజీ సీఎం లేఖ.. నీ మాటలు చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయ్!

తలైవీ సినిమా ప్రకటించినప్పటి నుంచి కంగనా రనౌట్ లైమ్ లైట్ లోనే ఉన్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన తలైవీ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది.

Kangana Ranaut: కంగనాకు మాజీ సీఎం లేఖ.. నీ మాటలు చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయ్!

Kanagana Ranaut

Updated On : September 19, 2021 / 9:09 AM IST

Kangana Ranaut: తలైవీ సినిమా ప్రకటించినప్పటి నుంచి కంగనా రనౌట్ లైమ్ లైట్ లోనే ఉన్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన తలైవీ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. సామాన్య అభిమానులతో పాటు సెలబ్రిటీలు ప్రముఖులంతా సోషల్ మీడియా హ్యాండిల్ తో అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం శాంత కుమార్ కి ప్రత్యేకమైన మెసేజ్ పంపారని ఇన్‌స్టా‌గ్రామ్ ద్వారా పంచుకున్నారు.

‘ఏం మర్యాద, ఏం వ్యక్తిత్వం ప్రముఖ నాయకులు, హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం గ్రేటెస్ట్ శ్రీ శాంత కుమార్ అందమైన లెటర్ పంపించారు. నా పనికి పంపిన ప్రశంసలకు కళ్లు చెమర్చాయి’ అంటూ కంగనా పిక్చర్ ను కూడా షేర్ చేశారు. దాని కింద ‘హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం నుంచి ప్రత్యేకమైన లెటర్ అందుకున్నాను. ఈ ప్రేమ, అభినందన గొప్ప రాజకీయ నాయకులలో ఒకరైన శాంత కుమార్ నుంచి రావడం నా జీవితంలోనే గొప్ప బహుమతి. థ్యాంక్యూ సార్’ అని అందులో పేర్కొంది.

 

View this post on Instagram

 

A post shared by Kangana Thalaivii (@kanganaranaut)

కొవిడ్ లాక్‌డౌన్ తర్వాత కంగనా.. సినిమాల వేగం పెంచారు. రీసెంట్ ధాకడ్ ప్రాజెక్ట్ పూర్తి చేసిన ఆమె తేజాస్ షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు. అంతేకాకుండా అలౌకిక్ దేశాయ్ తీస్తున్న సినిమాలో సీత పాత్రలో కనిపిస్తున్నట్లు చెప్పారు కంగనా.

Ganesh Immersion : ట్యాంక్ బండ్ కు చేరుకుంటున్న గణనాథులు..భారీగా ట్రాఫిక్ జామ్